తెలుగు సినిమా కార్పోరేటీకరణ రూటులో రోజు రోజుకీ ముందుకు వెళ్తోంది.అనేక పెద్ద సంస్థలు తెలుగు మార్కెట్ పై ఇప్పటికే కన్నేసాయి. అతిథి తో యు.టి.వి.సంస్థ తమ మొదటి అడుగును విజయవంతంగా వేసింది. మరో ప్రక్క పిరమిడ్ గ్రూపు వారు పంపిణీ రంగంలో ఇప్పటికే సంచలనాలు సృష్టిస్తున్నారు. దాంతో రిలయన్స్ గ్రూపుకు చెందిన యాడ్ ల్యాబ్స్ సంస్థ తెలుగు సినీ నిర్మాణ, పంపిణీ రంగాల్లోకి ప్రవేసించటానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. వాళ్ళు ఇప్పటికే ప్యామిలీ చిత్రాల దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డితో మూడు సినిమాల ఒప్పందం కుదుర్చుకున్నారు. తాజాగా ఆ సంస్థ క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌తోనూ సినిమాలు నిర్మించాలనుకుంటోంది. ముందస్తుగా ఆ సంస్థ 27 కోట్ల రూపాయల ఒప్పందాన్ని ఇప్పటికే పూరీతో కుదుర్చుకుంది. ఆయన ప్రస్తుతం ప్రభాస్ హీరోగా 'బుజ్జిగాడు.. మేడిన్ చెన్నై' సినిమాను రూపొందిస్తున్నాడు. దాని తర్వాత ఆయన యాడ్ ల్యాబ్స్ సినిమాను చేసే అవకాశముంది. కాగా యాడ్ ల్యాబ్స్ సంస్థ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 'కంత్రి' సినిమాను వైజాగ్ ఏరియాలో పంపిణీ చేస్తోంది. కంత్రి డైరక్టరు మెహర్ రమేష్ పూరీ శిష్యుడు కావటం గమనించ దగ్గ మరో విషయం.