For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి' హిందీ రీమేక్ కి రంగం సిద్దం

    By Srikanya
    |

    హైదరాబాద్ : తెలుగులో పదేళ్ల కిందట వచ్చి విజయవంతమైన చిత్రం 'అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి'. రవితేజ,అసిన్ జంటగా పూరీ జగన్ రూపొందించిన ఈ చిత్రాన్ని హిందీలో పునర్నిర్మించబోతున్నారు. దీనికి పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించే అవకాశాలున్నాయని బాలీవుడ్‌ సమాచారం. ఎన్‌.ఆర్‌.పచిసియా ఆ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పూరి ఇంతకు ముందు హిందీలో అమితాబ్‌ బచ్చన్‌తో 'బుడ్డా...' అనే చిత్రాన్ని రూపొందించారు.

    ప్రస్తుతం పచిసియా ఏడేళ్లనాటి మళయాళ చిత్రం 'రాజామాణిక్యం'ను రీమేక్‌ చేస్తున్నారు. కెమెరామెన్ గంగతో మంచి ఊపు మీద ఉన్న పూరీ జగన్ ఇప్పుడు అల్లు అర్జున్ తో తదుపరి చిత్రం హడావిడిలో ఉన్నారు. ఇద్దరు హీరోయిన్స్ తో అల్లు అర్జున్ తొలిసారి నటిస్తున్న చిత్రం 'ఇద్దరమ్మాయిలతో' పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బండ్ల శివబాబు సమర్పణలో బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమలాపాల్‌, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్ .

    ఇదిలా ఉంటే అభిమానులను అలరించటానికి 'పోకిరి', 'బిజినెస్‌మేన్‌'ల తరవాత మహేష్‌ బాబు, పూరి జగన్నాథ్‌ కలయికలో మరో చిత్రం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పూరి కథాంశాన్ని మహేష్‌కి వినిపించడం, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం కూడా జరిగాయని సమాచారం. ఈ చిత్రాన్ని బండ్ల గణేష్‌బాబు నిర్మిస్తారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.

    2013 వేసవి లో ఈ చిత్రం ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ చిత్రం రేసీ ఎంటర్టైనర్ గా రూపొందించనున్నారని తెలుస్తోంది. బిజినెస్ మ్యాన్ హిట్టవగానే వెంటనే పూరీ జగన్నాధ్ తను మహేష్ తో బిజినెస్ మ్యాన్ 2 చిత్రం చేస్తున్నానని ప్రకటించారు. అంతేగాక తాను ఓ లైన్ కూడా రెడీ చేసానని ప్రకటించారు. వచ్చే సంక్రాంతికి ఆ సినిమాని విడుదల చేస్తాను అన్నారు. అయితే ఆయన వరస ప్రాజెక్టులతో బిజీగా ఉంటూ ఆ విషయమే ఎత్తటం లేదు. దాంతో రకరకాల అనుమానాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేఫద్యంలో ఆయన మీడియాతో ఈ విషయమై క్లారిఫై చేసారు. ఆయన మాట్లాడుతూ.. బిజినెస్ మ్యాన్ 2 సినిమా ఇక లేనట్టే. ఆ స్థానంలో మహేష్‌ కోసం కొత్త కథ రాస్తా అన్నారు. కాబట్టి ఈ చిత్రం ఓ కొత్త కథ అని తెలుస్తోంది.

    English summary
    Puri Jagannath who made his mark in Bollywood with the Amitabh Bachchan’s Bbuddah-Hoga Tera Baap is planning to remake in Hindi his successful Telugu film Amma Nanna O Tamila Ammayi. The star cast is not finalised but indications are that top Hindi star will feature in it.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X