చిరు సినిమాకి వాళ్ళిద్దరూ స్క్రిప్టు రాస్తున్నారు
చిరంజీవి 150వ చిత్రాన్ని పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ గోపాల్ వర్మ పర్యవేక్షణలో చేస్తానని మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. దాంతో రామ్ గోపాల్ వర్మ, పూరీ కలిసి ఇద్దరూ స్క్రిప్టుని వండే పనిలో పడ్డారుట.ఇందుకు సంభందించిన పనులు రామ్ గోపాల్ వర్మ ముంబై ఆపీసులో స్పీడుగా జరుగుతున్నాయని వినికిడి. పూరీ..అమితాబ్ కి లేటు వయస్సులో హిట్ ఇచ్చినట్లుగానే చిరుకికూడా ఆయన అభిమానులు ఇష్టపడే సీన్స్ తో కథ రాయాలని కూర్చుని ప్రిపేర్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ చిత్రం కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఉండాలని చిరంజీవి ఆదేశించారట. అందేగాక ఠాగూర్,స్టాలిన్ తరహా జనాలకి సంభందించిన సీన్స్ ఉండాలని మరీ మరీ చెప్పారట. ఇక మహేష్ తో చేసే ది బిజినెస్ మెన్ చిత్రం పూర్తయ్యాక పూరీ ఈ చిత్రం షూటింగ్ ప్రారంభిస్తారు. రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. రామ్ చరణ్ ని పరిచయం చేస్తూ పూరీ రూపొందించిన చిరుత చిత్రం మంచి విజయాన్ని సాదించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











