Don't Miss!
- News రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
బాలయ్యకు సారీ చెప్పిన పూరీ
బాలకృష్ణ, పూరిల సినిమా వుంటుందంటూ ప్రకటనా వెలువడింది. ఆపై కథ కుదరక అది ఆగిపోయిందనే వార్తా వెలుగుచూసింది. అయితే కోన వెంకట్ చెప్పిన స్టోరి లైన్ బాలయ్యకు నచ్చిందనీ, ఆ కథతో సినిమా చేద్దామంటూ పూరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనీ తెలియడంతో మళ్ళీ నందమూరి అభిమానుల్లో ఆ ప్రాజెక్ట్ పై ఆశలు తలెత్తాయి కానీ రీసెంట్ గా బాలకృష్ణకు సారీ చెప్పేసి అక్కడ్నుంచి పూరీ పూర్తిగా తప్పుకున్నారనేది లేటెస్ట్ న్యూస్.
మరింతకీ పూరీ తన తదుపరి సినిమా ఎవరితో చెయ్యనున్నారో తెలుసా..బిగ్ బీ అమితాబ్ తో రామ్ గోపాల్ వర్మ రికమెండేషన్ తో..'బుడ్డా" అనే స్రిప్ట్ తో హిందీ సినిమా చేసేందుకు అమితాబ్ ని అప్రోచ్ అయిన పూరీకి బిగ్ బీ నుంచి అనుకూల స్పందన దక్కింది. కాగా సబ్జెక్ట్ ఓకే అయిపోవడంతో ఆగస్ట్ లో స్టార్ట్ చెయ్యాలనుకుంటోన్న 'బుడ్డా" షూటింగ్ షెడ్యూల్స్ ని వేసుకునే వర్క్ లో ప్రస్తుతం ముంబైలో బిజీగా వున్నారు పూరీ జగన్నాథ్. అన్నట్టు 'బుడ్డా" (వృద్దుడు)గా అమితాబ్ ని తానెంత పవర్ ఫుల్ రోల్ లో చూపిస్తున్నానన్నది అందరికీ ముందే అర్థమయ్యేలా ఆ టైటిల్ కి 'Don't f***with him' అనే ట్యాగ్ లైన్ పెట్టారు పూరీ..!