పూరి జగన్నాథ్ కి తెగ నచ్చేసింది ఈ డెమో(వీడియో)
హైదరాబాద్ : ఈ నెల 13 న విడుదల అవుతున్న చిత్రం టెంపర్. ఈ నేపధ్యంలో అభిమానులు ఉత్సాహంగా పండుగలా ఈ సినిమా విడుదల ను ఎంజాయ్ చేయాలని అందుకోసం ఎదురుచూస్తూ సంబరాలు చేస్కుకుంటన్నారు. అందులో భాగంగా వైజాగ్ కు చెందిన కొందరు కుర్రాళ్లు టెంపర్ చిత్రం పాటలతో ఓ డెమో చేసారు. ఇది పూరి జగన్నాథ్ కంట పడింది. ఆయన దీన్ని చూసి బాగా నచ్చి షేర్ చేసారు. మీరూ ఈ లుక్కేయండి మరి.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్, థియేట్రికల్ ట్రైలర్ విడుదలయినప్పటి నుండి సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అలాగే చిత్రం కు స్టన్నింగ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. అందుతున్న సమాచారాన్ని బట్టి దాదాపు అన్ని ఏరియాల బిజినెస్ క్లోజ్ చేసేసారు. ఆడియో పంక్షన్ లో ఈ చిత్రం అవుట్ పుట్ టెర్రిఫిక్ గా వచ్చిందని...తను తన సోదరుడు కలిసి ఈ చిత్రాన్ని స్వయంగా విడుదల చేస్తున్నామని బంగ్ల గణేష్ ప్రకటించారు. దానికి తోడు దర్సకుడు పూరి జగన్నాథ్ సైతం కొన్ని ఏరియాలు రైట్స్ తీసుకుంటున్నట్లు వార్త వచ్చింది. దాంతో ప్రి రిలీజ్ బిజినెస్ 42 కోట్ల వరకూ జరిగిందని ట్రేడ్ వర్గాల అంచనా.

మాగ్జిమం నెంబరాఫ్ థియోటర్స్ లో విడుదల అవుతున్న ఈ చిత్రం మొదటి షో హైదరాబాద్ భ్రమరాంబ థియోటర్ లో ఉదయం 5.07 నిముషాలకు విడుదల కానున్నదని సమాచారం. ఇప్పటికే నిర్మాత బండ్ల గణేష్ ఈ విషయమై ప్రకటన చేసి ఉన్నారు. అలాగే .. భ్రమరాంబ థియోటర్ లో గతంలో బాలకృష్ణ లెజండ్ చిత్రం విడుదలైన సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే ఈ లోగా సీడెడ్ లో చాలా చోట్ల 12 రాత్రి తెల్లారితే 13 అనగా షోలు పడతాయి. అయితే అఫీషియల్ గా ముహూర్తం మాత్రం భ్రమరాంబలో జరగనుంది.
ఆడియో విడుదల తర్వాత ‘టెంపర్' సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. రెస్పాన్స్ కు తగిన విధంగానే ఈ చిత్రాన్ని తొలిరోజు భారీ ఎత్తున విడుదల చేసేందుకు నిర్మాత బండ్ల గణేష్ ఏర్పాట్లు చేస్తున్నారు. వెయ్యికిపైగా థియేటర్లు ఇప్పటికే బుక్ చేసినట్లు సమాచారం. మరో వైపు అమెరికాలోనూ ఈ చిత్రాన్ని 100కుపైగా స్క్రీన్లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. సినిమాకు మ్యూజిక్ హైలెట్ అవుతుందని అంటున్నారు. ఫిబ్రవరి 13న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫుల్‌లెంగ్త్ కమర్షియల్, మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ ఎత్తున ఆశలు పెట్టుకున్నారు.


Click it and Unblock the Notifications











