చావు దేనికీ శాశ్వత పరిష్కారం కాదు...పూరి జగన్నాధ్
'ఆత్మహత్యల నేపథ్యంలో అల్లుకున్న కథ ఇది. తాత్కాలిక సమస్యలకు చావు శాశ్వత పరిష్కారం కాదనే విషయాన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో జోడించి ఈ చిత్రంలో చర్చించే ప్రయత్నం చేసాం అంటూ తన తాజా చిత్రం నేనూ...నా రాక్షసి గురించి చెప్పుకొచ్చారు దర్సకుడు పూరీ జగన్నాధ్. అలాగే ఓ కిల్లర్‌కి, రాక్షసిలాంటి అమ్మాయికి మధ్య జరిగిన ప్రేమ కథ ఇది. తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుందనడం లో సందేహం లేదని అన్నారు.రాణా, ఇలియానా జంటగా శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మిస్తున్న చిత్రం 'నేను నా రాక్షసి". ఈ చిత్రానికి సంబంధించిన పాటలు మధుర ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా మార్కెట్‌లోకి విడుదలయ్యాయి.


Click it and Unblock the Notifications











