పోకిరి చేయనన్న స్టార్ హీరో: పూరీ జగన్నాద్
పోకిరి రీమేక్ చేద్దామనుకుని ఆ స్టార్ హీరోకి చూపించాను కానీ అతనికి నచ్చలేదు. ఆయనతో ఈ ఏక్ నిరంజన్ చిత్రం గ్యారెంటీగా హిందీలో రీమేక్ చేస్తాను అంటున్నారు పూరీ జగన్నాధ్. ఆ స్టార్ హీరో మరెవరో కాదు అబిషేక్ బచ్చన్. తన పోకిరికథతో వచ్చిన వాంటెడ్ హిందీ సినిమా విజయోత్సాహాన్ని తలుచుకునో లేక ఏక్ నిరంజన్ పైన ఉన్న విపరీతమైన నమ్మకమో ఆయనచేత ఆ ఆ మాట అనిపించి ఉండవచ్చు.
ఇక..నేను కొడితే మామూలుగా ఉండదు..గుర్తు వచ్చినప్పుడల్లా తలుచుకుని తలుచుకుని ఏడుస్తావు వంటి పంచ్ డైలాగులతో..అమ్మా లేరు..నాన్న లేరు వంటి టాప్ సాంగ్ లతో ఏక్ నిరంజన్ గురువారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా పూరీ ఈ చిత్రం గురించి మీడియాతో ముచ్చటించారు. ఈ చిత్రంలో ప్రభాస్ పాత్ర బౌంటీ హంటర్ అని చెప్పు కొచ్చారు. బెయిల్ మీద బయిటకు వెళ్ళి పారిపోయిన వాళ్ళను పట్టి తేవటం, పారిపోయిన క్రిమినల్స్ ని పట్టుకోవటం వంటి పనులు డిపార్ట్ మెంట్ లో లేకుండా చేస్తూంటాడు. పోలీసులు ఇచ్చిన రెండు వేలో మూడు వేలో తీసుకుని బ్రతుకుతూంటాడు అదీ క్యారెక్టర్ అని చెప్పారు.
అలాగే సూపర్ హిట్టయిన అమ్మా లేరు..నాన్న లేరు పాట గురించి చెబుతూ ఈ పాట అమ్మా నాన్న ఉన్నవాళ్ళకు కూడా కనెక్ట్ అవుతోంది. మణిశర్మ గారి అధ్బుతమైన ట్యూన్ అది అన్నారు. అలాగే కంగనా రౌనత్ గురించి చెపుతూ ఆమె సినిమాల్లోకి రాకముందు నుంచీ తెలుసన్నారు. అలాగే ఆమెను పోకిరిలో తీసుకుందామని కాంటాక్ట్ చేస్తే ఆమె గ్యాంగస్టర్ సినిమాలో బుక్కయిందని ఆగామన్నారు. ఇక ఈ సినిమా గ్యారెంటీగా విజయం సాధిస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేసారు.


Click it and Unblock the Notifications











