పవన్ కళ్యాణ్ తో చిత్రం గురించి పూరీ ట్వీట్

By Srikanya

పవన్ కళ్యాణ్ తో లాంగ్ గ్యాప్ తర్వాత పూరీ జగన్నాధ్ మరో చిత్రం కమిటైన సంగతి తెలిసిందే. ఆయన ఈ చిత్రం గురించి తాజాగా ట్వీట్ చేస్తూ...పవన్ కళ్యాణ్ ప్రాజెక్టు మే నెల నుంచి ప్రారంభం అవుతుంది. ఇప్పుడే ఫైనలైజ్ అయ్యింది ..అన్నారు. ఇక ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తునట్లు సమాచారం. ఈ మేరకు మాటలు జరగాయని, పూరీ చెప్పిన కథని పవన్ ఓకే చేసాడంతో ఈ ట్వీట్ చేసాడని చెప్తున్నారు. ఇక పూరీ కెరీర్ ప్రారంభంలో బద్రీ అనే చిత్రాన్ని పవన్ తో చేసారు. మళ్లీ అప్పటినుంచీ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రాలేదు. మళ్లీ ఇన్నాళ్లకు పవన్, పూరీ లను నిర్మాత డివివి దానయ్య కలుపుతూ సినిమా చేస్తున్నారు.

ఇక హీరోయిన్ గా అనీల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ ..తన గబ్బర్ సింగ్ చిత్రం షూటింగ్ లో బిజిగా ఉన్నాడు. హరీష్ శంకర్ దర్సకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తోంది. అలాగే పూరీ దర్శకత్వంలో మహేష్ హీరోగా రూపొందిన బిజినెస్ మ్యాన్ చిత్రం హిట్టవటంతో ఆ ఉత్సాహంలో వరస ప్రాజెక్టులు కమిటవుతున్నారు. ఇక పవన్ తో చేయబోయే చిత్రం కొత్త తరహా డైలాగులతో, స్టైలిష్ మేకింగ్ తో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని చెప్తున్నారు. త్వరలోనే ఈ మేరకు అఫీషయల్ ప్రకటన రానుందని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X