నిజమో కాదో ఇంకా రూఢీ కాలేదు కానీ...మన పూరి జగన్నాథ్ బాలీవుడ్ సెక్సీ స్టార్ మల్లికా షెరావత్ తో సినిమా తీయాలని తీవ్రంగా యోచిస్తున్నాడట. కమల్ హాసన్ సినిమా దశావతారం సినిమా కోసం మల్లికా షెరావత్ చెన్నయ్ వచ్చినపుడు పూరి జగన్నాథ్ ఆమెను కలుసుకున్నాడట. అంతేకాదు ఆమెతో సినిమా తీయాలనుకున్న కథను కూడా చెప్పాడట. ఆమెకు కథ నచ్చి సంతోషంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అడ్వాన్స్ కూడా పుచ్చుకుందట. అయితే కాల్షీట్ ప్రాబ్లమ్స్ తో ఆమె తన సమయాన్ని కేటాయించలేకపోతున్నట్టు సమాచారం. ఇక కథ విషయానికి వస్తే ఒక యువతి శృంగార కోర్కెలు ఎక్కువగా ఉండడంవలన ఎదురయ్యే సంఘటనలతో కూడుకుని ఉంటుందిట. ఇంకేముంది సినిమా అద్భుతంగా ఉంటుందని అనుకోవచ్చు. ఇది బానే ఉంది కానీ పూరి లాంటి పెద్ద డైరెక్టర్ అలాంటి సినిమా తీయాల్సిన అవసరం ఏమొచ్చిందా అని.