పూరీ జగన్ ఆ సినిమాని హిందీలోకి రీమేక్
అమితాబ్ తో చేసిన బుడ్డా చిత్రం హిట్ టాక్ రావటంతో పూరీ జగన్నాధ్ కంటిన్యూగా బాలీవుడ్ చిత్రాలు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అందులో బాగంగా తెలగులో తన దర్సకత్వంలో వచ్చి హిట్టయిన అమ్మా...నాన్న తమిళ అమ్మాయి చిత్రాన్ని హిందిలోకి రీమేక్ చేయాలని ఆలచనలో ఉన్నట్లు చెప్తున్నారు. అయితే ఎవరితో చేయాలనుకుంటున్నారనే డిటేల్స్ మాత్రం ఆయన ఇవ్వలేదు. ఇక ప్రస్తుతం పూరి జగన్ తన తదుపరి చిత్రం ది బిజెనెస్ మ్యాన్ ని తెలుగులో మహేష్ తోనూ, హిందిలోనూ అభిషేక్ బచ్చన్ తోనూ ప్లాన్ చేస్తున్నారు. ఆ చిత్రం అనంతరం చిరంజీవితో నూట యాభైవ చిత్రాన్ని దర్సకత్వం చేయటానికి స్క్రిప్టు రెడీ చేస్తున్నారు. ఇక ఇంతకుముందు పూరీ హిందీలో తెలుగులో వచ్చి హిట్టైన బద్రీ చిత్రాన్ని హిందిలోకి రీమేక్ చేసాడు.కానీ అది వర్కవుట్ కాలేదు. అయితే ఇప్పుడు తనకు తెలుగులో వచ్చిన హిట్ సినిమాలను హిందీలోకి రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. దానికి తగినట్లుగా హిందిలోనూ రీమేక్ లు ట్రెండ్ నడుస్తోంది.


Click it and Unblock the Notifications











