ఆమె డ్రీమ్ బాయ్ చిరు బావేనట!!!!
మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ నటించిన తొలి చిత్రం చిరుతకు దర్శకత్వం వహించిన పూరి జగన్నాథ్ మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలు చెప్పాడు. పూరి తన భార్యను ఇష్టంగా పండూ అని పిలుచుకుంటాడట. అదే పేరును పోకిరి సినిమాలో హీరో పేరు కూడా పండూ పెట్టడానికి కారణం ఆయన భార్యేనట. తన డ్రీమ్ గర్ల్ ఎప్పటికీ తన భార్యే అంటున్నాడు. తనకు నచ్చిన హీరోయిన్ శ్రీదేవని చెప్పాడు. నచ్చిన ప్లేస్ బ్యాంకాక్ అట. ఇలాంటి విషయాలను పండూ అదే పూరి భార్య నడిగితే పూరికి భిన్నంగా చెప్పింది. ఆమె డ్రీమ్ బోయ్ చిరంజీవి అట. ఫేవరేట్ హీరోయిన్ శ్రీదేవేనట. నచ్చిన హీరో చిరంజీవి బావ అంట. నచ్చిన ప్లేస్ బ్యాంకాకే నట. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పవలిసింది పండూ డ్రీమ్ బాయ్ కమ్ నచ్చిన హీరో చిరంజీవి బావేనట.


Click it and Unblock the Notifications











