పూరి జగన్నాధ్ ఆ హీరో స్క్రిప్టు పనిలో ఫుల్ బిజీ...

By Srikanya

హైదరాబాద్: పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వైజయంతి మూవీస్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించబోతోంది. సి.అశ్వనీదత్‌ నిర్మాత. ఈ చిత్రం ద్వారా నాగబాబు కుమారుడు వరుణ్‌తేజ్‌ హీరోగా పరిచయమవుతారు. ఇప్పటికే కథాచర్చలు సాగుతున్నాయి. చిత్రానికి సంబంధించిన కొన్ని పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. పూర్తి వివరాలు కొద్ది రోజుల్లో వెల్లడిస్తామని చిత్ర వర్గాలు తెలిపాయి.

అలాగే ఈ చిత్రాన్ని మొదట శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ప్లాన్ చేసారు. కానీ చివరి నిముషంలో శ్రీకాంత్ అడ్డాల పర్శనల్ ప్లాబ్లంస్ వల్ల డ్రాప్ అవ్వాల్సి వచ్చిందని సమాచారం. పూరి డైరక్ట్ చేసే ఈ చిత్రం వచ్చే నెలలో సెట్స్ కు వెళ్లనుంది. అలాగే 2007 లో పూరీ చిరుతతో రామ్ చరణ్ ని లాంచ్ చేయటంతో ఈ నిర్ణయం నాగబాబు తీసుకున్నట్లు సమాచారం.

ఇక పూరీ రీసెంట్ చిత్రం ఇద్దరమ్మాయిలతో భాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కవుట్ కాలేదు. అయినా కలెక్షన్స్ పరంగా ఓకే అనిపించింది. కథా లోపమే సినిమాని నిలబెట్టలేకపోయిందని టాక్ వచ్చింది. దాంతో ఈ కొత్త చిత్రంలో పూర్తిగా కథపైనే దృష్టి పెట్టారని చెప్తున్నారు. వరుణ్ తేజ్ ఈ చిత్రంతో మాస్ హీరోగా నిలబెట్టాలని నాగబాబు ప్లాన్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X