Allu Arjun: అల్లు అర్జున్ కి రేవతి మ్యాటర్ ముందే తెలుసా..? షాకింగ్ వీడియో వైరల్
Allu Arjun video Viral: అల్లు అర్జున్ -సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా పుష్ప 2. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. ఎవరు ఊహించని విధంగా రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూలు చేస్తూ బాక్సాఫీస్ షేక్ చేస్తుంది. విడుదలైన నాటి నుండి భారీ మొత్తంలో వసూలు చేస్తూ పుష్పగాడు బాక్సాఫీస్ ను రూల్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే
ప్రీమియం షో సందర్భంగా హైదరాబాదులోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఆ ఘటనకు లింక్ చేస్తూ.. రేవతి విషయం అల్లు అర్జున్ కు ముందే తెలుసా? అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వీడియో ఏంటో ఓ లుక్కేయండి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా పుష్ప. 2021 లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఎవరు ఊహించని విధంగా నార్త్ లో కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్లు వసూలు చేసింది. ఈ భారీ విజయాన్ని అందుకున్న సినిమాకు సీక్వెల్ గా పుష్ప ది రూల్ ( Pushpa 2) తెరకెక్కింది. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12 వేలకు పైగా థియేటర్లలో రిలీజ్ అయి రికార్డు క్రియేట్ చేసింది.

అలాగే పలు పాన్ ఇండియా సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తూ నయా రికార్డులను క్రియేట్ చేస్తుంది. ఇప్పటివరకు అతి తక్కువ సమయంలో 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది పుష్ప 2. ఇప్పటికే 1500 కోట్లకు పైగా వసూలు చేసిన సినిమా సక్సెస్ గా రన్ అవుతుంది. బాహుబలి 2 రికార్డును కూడా బ్రేక్ చేసే దిశగా దూసుకు వెళ్తుంది.
అయితే ఇంతటి భారీ సక్సెస్ ను అందుకున్న మూవీ యూనిట్ మాత్రం ఆనందంగా లేదనే చెప్పాలి. దీనికి కారణం డిసెంబర్ 4న బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. హీరో అల్లు అర్జున్ స్వయంగా వచ్చి తన ఫ్యాన్స్ తో సినిమా చూడాలని భావించారు. ఈ సమయంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ సమయంలో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ అభిమానురాలు ప్రాణాలు కోల్పోయింది.అలాగే ఆమె కొడుకు కూడా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ విషయాన్ని తెలంగాణ సర్కార్ సీరియస్ గా తీసుకుంది.
ఈ నేపథ్యంలో సంధ్యా థియేటర్, అల్లు అర్జున్ పై కేసుల నమోదు చేసింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ని అరెస్టు చేసి రిమాండ్ తరలించగా.. అనంతరం బెయిల్ పై విడుదలయ్యారు. ఈ ఘటన యావత్ సినీ ప్రపంచాన్ని షేక్ చేసిందని చెప్పాలి. కొందరు అల్లు అర్జున్ కు సపోర్టుగా నిలుచకుంటే.. మరికొందరు ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఘటనలో అల్లు అర్జున్ ను సెంటర్ గా చేస్తూ పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికే అల్లు అర్జున్ ను పోలీసులు విచారించారు. ఆ విచారణలో మొత్తం 18 ప్రశ్నలు అడగగా అందులో 15 ప్రశ్నలకు మాత్రమే అల్లు అర్జున్ సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం.. అల్లు అర్జున్ థియేటర్ కు వచ్చిన కాసేపటికి రేవతి అని మహిళా మరణించింది. ఈ విషయం అల్లు అర్జున్ కు ముందే తెలుసు. కానీ, ఈ మధ్య జరిగిన ప్రెస్ మీట్ లో తనకు మాత్రం ఏమీ తెలియదు అంటూ తనపై అబద్ధాలు లేనిపోని ఆరోపణలు సృష్టిస్తున్నారంటూ అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. అయితే విచారణ సమయంలో కూడా ఈ విషయంపై ప్రశ్నించగా.. అల్లు అర్జున్ సైలెంట్ గానే ఉండిపోయారట.
మొత్తానికి సంధ్యా థియేటర్ ఘటన అల్లు అర్జున్ పైనే కాదు. టాలీవుడ్ పై కూడా ఎఫెక్ట్ పడింది. ఈ ఘటనను బేస్ చేసుకున్న ప్రభుత్వం.. ఇకపై బెనిఫిట్ షో, ప్రీమియర్ షోలకు అనుమతులు ఇవ్వబోదంటూ రాష్ట్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. నేడు ఈ విషయంపై సినీ పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి తో భేటీ అయిన ఫలితం లేకుండా పోయిందంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోతో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనను లింక్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. అల్లు అర్జున్ నటించిన 'అలా వైకుంఠపురం' సినిమాలోని సీన్ అది. అందులో అల్లు అర్జున్, టాబు మధ్య జరిగే సంభాషణ ఉంది. ఆ సీన్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. 'ఆయన ఏదో తప్పు చేసి ఉండాలి' అనగా వెంటనే టాబు ఏంటదని అడుగుతుంది. అప్పుడు అల్లు అర్జున్.. 'రేవతి' అని సమాధానం ఇస్తారు.
అది ఆ సినిమాలో సందర్భానుసారంగా వచ్చిన సీన్. అయితే ఆ వీడియోను ప్రస్తుతం టాలీవుడ్ లో జరుగుతున్న పరిణామాలకు లింక్ చేశారు. ఎందుకంటే.. సంధ్య థియేటర్ ఘటనలో చనిపోయిన మహిళ పేరు కూడా 'రేవతి' కావడంతో ఈ వీడియో వైరల్ అవుతుంది. రేవతి విషయం అల్రేడీ అల్లు అర్జున్ కి తెలుసా?, విధి వ్రాత అంటూ సెటైరికల్ గా కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది.


Click it and Unblock the Notifications











