Game Changer Review: గేమ్‌ ఛేంజర్‌ ఫస్ట్‌ రివ్యూ.. రామ్‌చరణ్‌ మూవీపై హైప్ పెంచిన సుకుమార్..

Game Changer Review: గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తేజ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్‌ ఛేంజర్‌ (Game changer). ఈ సినిమాకు దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు శంకర్ (Shankar) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. కార్తీక్ సుబ్బ‌రాజు స్టోరీని అందించారు. పొలిటిక‌ల్ బ్యాక్‌డ్రాప్ గా తెరకెక్కిన ఈ సినిమాను భారీ బ‌డ్జెట్‌తో శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌ రాజు తెర‌కెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాను సంక్రాంతి​ కానుక‌గా జ‌న‌వ‌రి 10న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతుంది. తాజాగా పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్.. గేమ్ చేంజర్ ఫస్ట్ రివ్యూ ఇప్పుడు వైరల్ అవుతోంది.

రామ్ చరణ్ తేజ్- డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కించిన 'గేమ్‌ ఛేంజర్‌' సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. దిల్‌ రాజు నిర్మాతగా వ్యవహరించగా.. తమన్‌ సంగీతం అందించారు. ఈ సినిమా లో ఎస్‌జే సూర్య, శ్రీకాంత్‌, అంజలి, సునీల్‌, ప్రకాశ్‌రాజ్‌, జయరామ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో 'గేమ్‌ ఛేంజర్‌' విడుదల కానుంది. RRR లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కోసం చాలా కాలం గ్యాప్ తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Pushpa 2 director Sukumar shared Ram Charan s Game Changer first review and called National Award performance

గేమ్ చేంజర్ సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న కొద్ది మూవీ యూనిట్ ప్రమోషన్స్లలో బిజీబిజీగా మారింది. ఎవరు ఊహించని విధంగా ఈ భారీ బడ్జెట్ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను అమెరికాలోని డల్లాస్ లో నిర్వహించారు. ఈ గ్రాండ్ ఈవెంట్లో పుష్ప 2 సినిమా డైరెక్టర్ సుకుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో సుకుమార్ మాట్లాడుతూ.. 'నేను సినిమా చేసేటప్పుడు ప్రతి హీరోను ప్రేమిస్తాను. మా అనుబంధం అలా ఒకటి రెండు ఏళ్ల పాటు సాగుతోంది. సినిమా అయిపోయాక వాళ్ళతో అంతగా టచ్ లో ఉండను. కానీ, రంగస్థలం పూర్తి అయిన తర్వాత కూడా రామ్ చరణ్ తో రిలేషన్ అలానే కంటిన్యూ అయింది. చరణ్ నాకు సోదరులాంటివాడు. చాలా విషయాలను మేమిద్దరం డిస్కస్ చేసుకుంటాం.' అన్నారు.

'మీకు అన్నిటికంటే ముఖ్యమైన రహస్యం మీకు చెప్పాలి. నేను మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి గేమ్ చేంజర్ సినిమాను చూశాను. అందుకే ఫస్ట్ రివ్యూ నేనే ఇస్తాను. ఫస్ట్ ఆఫ్.. అద్భుతం. ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్. సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూస్తే గూస్ బంప్స్. శంకర్ గారి జెంటిల్మెన్, భారతీయుడు వంటి సినిమాలు చూసి ఎంత ఎంజాయ్ చేశానో.. ఈ సినిమా చూసి అంతే ఎంజాయ్ చేశా.. రంగస్థలం సినిమాకి రామ్ చరణ్ కు నేషనల్ అవార్డు వస్తుందని అందరం భావించాం. ఈ సినిమా క్లైమాక్స్ లో రామ్ చరణ్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే మరోసారి అలాంటి ఫీలింగ్ కలిగింది. అంతకంటే ఎక్కువే అనిపించింది. గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ అద్భుతంగా నటించాడు. ఈసారి కచ్చితంగా రామ్ చరణ్ నేషనల్ అవార్డు వస్తుంది' అంటూ సుకుమార్ గేమ్ చేంజర్ సినిమా రివ్యూ చెప్పేశాడు.

Pushpa 2 director Sukumar shared Ram Charan s Game Changer first review and called National Award performance

పుష్ప 2 లాంటి సినిమాను తెరకెక్కించిన సుకుమార్.. గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ మూవీ అవుతుందని, రామ్ చరణ్ కు నేషనల్ అవార్డు పక్క అని చెప్పడంతో ఈ మూవీపై భారీ అంచనాలను నెలకున్నాయి. మరి సంక్రాంతి రేసులో నిలబడ్డ గేమ్ చేంజర్ ఎలాంటి గేమ్ ప్లే చేస్తుందో.. వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Read more about: ram charan game changer sukumar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X