Valentine Day: సుకుమార్ అందమైన ప్రేమకథ మీకు తెలుసా? ఐదేళ్ల పోరాటం తర్వాత!

ప్రేమ కథలను ఎంతో చక్కగా తెరపై ప్రదర్శించే మన క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన సినిమాలకు, రైటింగ్ స్టైల్ కు కోట్లాది నుంచి ఆదరణ దక్కుతున్న విషయం తెలిసిందే. హీరోలను కొత్త స్టైల్ ను ఇస్తూనే.. బలమైన పాత్రలను పరిచయం చేస్తున్నారు. ఆర్య, జగడం, 100% లవ్, 1నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో, రంగస్థలం వంటి చిత్రాలతో ఎంతటి మేజిక్ చేశారో తెలిసిందే. ఇక 'పుష్ప'తో ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్స్ లిస్ట్ లో చోటు సంపాదించుకున్నారు. చివరిగా 'పుష్ప2 దిరూల్'తో చివరిగా మరింత సెన్సేషన్ గా మారిన విషయం తెలిసిందే.

సుకుమార్ సినిమాల్లో బలమైన కథ, క్యారెక్టరైజేషన్ తో పాటుగా మరిచిపోలేని లవ్ స్టోరీస్ కూడా ఉంటాయి. ఆర్యలో ట్రాయంగిల్ లవ్ స్టోరీని పరిచయం చేసి అప్పట్లో ఇండస్ట్రీని షేక్ చేశారాయన. లెక్కలు వేసి నాన్నకు ప్రేమకుతో చిత్రంలో లవ్ స్టోరీని నడిపించారు. రంగస్థలంలో ప్యూర్ లవ్ ని, పుష్ఫలో లవ్ స్టోరీస్ కి కొత్త నిర్వచనం ఇచ్చి ఆశ్చర్యపరిచారు. అయితే.... సుకుమార్ చిత్రాల్లోనే కాదు.. రియల్ లైఫ్ లోనూ అద్భుతమైన లవ్ స్టోరీ దాగి ఉంది. సుకుమార్ - తబితా హంసినీని అందమైన ప్రేమకథను వాలెంటైన్స్ వీక్ సందర్భంగా సినీ ప్రియులు, సుక్కు అభిమానుల కోసం..

Pushpa 2 Director Sukumar s Emotional Love story with Tabita Here is Valentine Day 2025 Special story

సుకుమార్ తబితాను మొదటగా ఓ సినిమా హాళ్లో కలిశారంట. అక్కడి నుంచి పరిచయం ఏర్పడింది. తర్వాత సుక్కు ధైర్యం చేసి ఫోన్ నంబర్ ఇచ్చారట. అలా తరుచుగా మాట్లాడుకునే వారు. కానీ ఇక్కడ మన డైరెక్టర్ ఫోన్ నెంబర్ ఇచ్చింది లవ్ కోసం కాదండోయ్.. తబితా అడిగిన ఒక్క చిన్న ప్రశ్నకు సమాధానంగా మాత్రమే.. ఆ ప్రశ్న ఏంటంటే.. 'అసలు డైరెక్టర్ ఏం చేస్తాడు'... ఈ ప్రశ్నకు సుకుమార్ ఎన్నో విధాలుగా తబితకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశాడంట.కానీ ఆమె ఏమాత్రం ఒప్పుకోలేదంట.

నిర్మాత డబ్బులు పెడ్తారు.. యాక్టర్ యాక్టింగ్ చేస్తాడు.. మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్స్ కంపోజ్ చేస్తాడు.. ఇక డైరెక్టర్ గా మీరు చేసేదేంటీ అని ఆ తర్వాత ప్రశ్నల వర్షం కురిపించిందంట... ఎన్ని విధాలు సుక్కు బదులిచ్చిన కన్విస్ కాలేకపోయింది. డైరెక్టర్ అంటే ఏంటి అనే చెప్పే ప్రాసెస్ లోనే తబితాతో సుక్కు లవ్ లో పడ్డారని ఓ ఇంటర్వ్యూలోనూ చెప్పారు. అలా చాలా కాలం ప్రేమ పాఠాలు చదివారు. దాదాపు ఐదేళ్ల పాటు రిలేషన్ లో ఉన్న సుకుమార్ - తబితా ఇంట్లో వాళ్లను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

Pushpa 2 Director Sukumar s Emotional Love story with Tabita Here is Valentine Day 2025 Special story

సుకుమార్ పెళ్లికి ముందే 'ఆర్య' సినిమా తీయడంతో.. తబితా వాళ్ల పేరెంట్స్ ఇండస్ట్రీ వ్యక్తిని అని ఒప్పుకోలేదంట. వారి అంగీకారం కోసం ఏకంగా వీళ్లు నాలుగేండ్లకు పైగా దాదాపు ఐదేండ్లు ఎదురుచూశారు. ఎలాగో పెద్దల మనస్సు గెలిచి 2009లో వారి ప్రేమబంధం, మూడుమూళ్ల బంధంలోకి చేరింది. వారికి కూతురు సుకృతి, కొడుకు సుక్రాంత్ ఉన్నారు. రీసెంట్ గా సుకుమార్ కుతూరు గాంధీ తాత చెట్టు చిత్రంలో నటించింది. గత నెల 24న థియేటర్లలోనూ విడుదలైందీ చిత్రం.

ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా, ప్రస్తుత కోనసీమ జిల్లా మలికిపురం.. మట్టపర్రు గ్రామంలో జన్మించారు ఆయన. తండ్రి తిరుపతి రావు నాయుడు, తల్లి వీరవేణి. ఆయనకు ఆరుగురు తోబుట్టువులు ఉన్నారు. రాజోలు జడ్పీహెచ్ ఎస్ లో విద్యనభ్యసించారు. లెక్కల మాస్టర్ గా కాకినాడ ఆదిత్య జూనియర్ కాలేజీలో ఏడేండ్ల పాటు పనిచేశారు. సైన్స్ కూడా బోధించారు. రైటింగ్ పై ఉన్న ఆసక్తితోనే సినిమాల్లోకి వచ్చి.. డైరెక్టర్ గా ఎన్ని అద్భుతాలు చేస్తున్నారో తెలిసిందే.

More from Filmibeat

Read more about: sukumar pushpa 2 the rule
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X