Khairatabad RTA లో అల్లు అర్జున్.. ఐకాన్ స్టార్ ఎందుకు వచ్చారంటే?
సినీ, రాజకీయ నటులు వ్యక్తిగత పనుల కోసం రావడం చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. వారికి ఏదైనా పనులుంటే వ్యక్తిగత సహాయకులు చేసి పెడుతుంటారు. కానీ కొన్ని ప్రభుత్వానికి సంబంధించిన పనులు, చట్టబద్దమైన పనుల కోసం ఎవరైనా సరే స్వయంగా రావాల్సిందే. తాజాగా తన వ్యక్తిగత పనుల కోసం అల్లు అర్జున్ ప్రభుత్వ కార్యాలయానికి రావడం ఆసక్తికరంగా మారింది. ఆ వివారాల్లోకి వెళితే.
పుష్ప 2 సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాస్త తీరిక చేసుకొని వ్యక్తిగత పనుల కోసం బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టారు. డ్రైవింగ్ లైసెన్స్ కోసం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీవీ కార్యాలయానికి రావడంతో సినీ అభిమానులు ఆశ్చర్యపోయారు. స్టైలిష్ స్టార్ రావడంతో అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ఆయన వెంట సిబ్బంది ఉండి.. ఆయనకు కావాల్సిన పనులను పూర్తి చేసి పంపించారు.

ఇప్పటికే ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన అల్లు అర్జున్.. ప్రస్తుతం ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఖైరతాబాద్ RTA ఆఫీస్‌కు వచ్చారు. వెహికల్ యాక్ట్ ప్రకారం చట్ట నిబంధనలు అనుసరించి అందుకోసం కావాల్సిన వ్యవహారాలను పూర్తి చేశారు. అనంతరం ఆర్టీఏ అధికారులకు ధన్యవాదాలు తెలియజేసి వెళ్లిపోయాడు.

అయితే అల్లు అర్జున్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం వచ్చారు. వెహికల్ యాక్ట్ రూల్స్ ప్రకారం డాక్యుమెంట్స్ దాఖలు చేశారు. అందుకోసం పాటించాల్పిన నిబంధనలు పూర్తి చేశారు. అధికారులకు సహకరించి తన పనులు పూర్తి చేశారు అని ఆర్టీఏ అధికారులు తెలిపారు.

అల్లు అర్జున్ ఆర్టీఏ కార్యాలయంలో ఉన్నంత సేపు సందడిగా మారింది. ఆర్టీఏ ఆఫీస్‌లో పనుల కోసం వచ్చిన వాహనదారులు, క్లయింట్స్ అందరూ అల్లు అర్జున్‌ను చేసేందుకు ఉత్సాహం చూపారు. వారిని కంట్రోల్ చేయడానికి అధికారులు, బాడీగార్డుల కొంత శ్రమించాల్సి వచ్చింది.


Click it and Unblock the Notifications











