What is ADHD? పుష్ప 2 యాక్టర్‌కు అరుదైన వ్యాధి.. ఆయన పరిస్థితి ఏమిటంటే?

ఫహాద్ ఫాజిల్ గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పుష్ప సినిమాతో ఫహాద్ తెలుగువారికి ఫేవరేట్ హీరోగా మారాడు. అయితే ఆయన గురించి తెలుగువారికి తెలిసింది చాలా తక్కువ. ఫహాద్ కూడా నెపో కిడ్డే అన్న విషయం ఎంతమందికి తెలుసు. ఫహాద్ తండ్రి మలయాళ చిత్ర దర్శకుడు, నిర్మాత ఫాజిల్. ఎన్నో మంచి సినిమాలను ఇండస్ట్రీకి అందించాడు.

ఇక ఆయన నట వారసుడుగా కైయెతుమ్ దూరత్ అనే సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు ఫహాద్. ఈ సినిమాకు ఆయన తండ్రి ఫాజిల్ దర్శకత్వం వహించడం విశేషం. మొదటి సినిమానే ఫహాద్ కు భారీ పరాజయాన్ని ఇచ్చింది. అసలు ఇతను హీరో ఏంటి.. నెపోటిజం తో వచ్చాడు కానీ, నటన లేదు.. ముఖంలో హీరో లక్షణాలు లేవు అంటూ విమర్శించారు.

Pushpa 2 Fame Fahadh Faasil diagnosed with ADHD at 41 recalls conversation with doctor

ఫహాద్ వాటిని పట్టించుకోకుండా మంచి కథలను ఎంచుకుంటూ విజయం కోసం ఎదురుచూశాడు. అలా అతనికి బెంగుళూరు డేస్ సినిమా వచ్చింది. ఇందులో కీలక పాత్రలో ఫహాద్ నటించి మెప్పించాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. కానీ, హీరోగా అతనికి గుర్తింపు తెచ్చిన చిత్రం అంటే.. మహేశింటే ప్రతీకారం. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అందుకుంది. దీని తరువాత ఫహాద్ వెనక్కి తిరిగి చూడలేదు. కుంబళంగి నైట్స్, అతిరన్, సూపర్ డీలక్స్, ట్రాన్స్, జోజి, విక్రమ్.. ఇలా వరుస సినిమాలతో స్టార్ హీరోగా మారిపోయాడు.

విలక్షణ నటనను కనపరుస్తూ కేవలం హీరోగానే కాకుండా విలన్ గా, సపోర్టివ్ రోల్స్ తో కూడా మెప్పిస్తూ వస్తున్నాడు. ఇక ఇంకోపక్క తాను ప్రేమించిన అమ్మాయిని వివాహమాడి లైఫ్ లో కూడా సక్సెస్ అయ్యాడు. బెంగుళూరు డేస్ సినిమా షూటింగ్ సమయంలో హీరోయిన్ నజ్రియాను ప్రేమించి .. పెద్దల అంగీకారంతో ఆమెనే వివాహం చేసుకున్నాడు. ఈ మధ్యనే ఆయన నటించిన ఆవేశం సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరి రికార్డ్ సృష్టించింది.

Pushpa 2 Fame Fahadh Faasil diagnosed with ADHD at 41 recalls conversation with doctor

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఫహాద్ ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు అధికారికంగా తెలిపాడు. కేర‌ళ‌లోని ఒక చిల్డ్ర‌న్ రీ హాబిలిటేష‌న్ సెంట‌ర్ ఓపెనింగ్ కి గెస్ట్ గా హాజరైన ఫహాద్ ఒక షాకింగ్ విషయాన్ని చెప్పుకొచ్చాడు. తాను ADHD వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపాడు. ADHD అంటే అటెన్ష‌న్ డెఫిసిట్ హైప‌ర్ యాక్టివ్ డిసార్డ‌ర్. దీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే.. ఏ విషయంపైనా ఏకాగ్రత, ధ్యాస ఉండదు. హైప‌ర్ యాక్టివ్, హైప‌ర్ ఫోక‌స్, ఇంప‌ల్సివిటీ లాంటివి కనిపిస్తాయి. దీనివలన ఎక్కువ ఒత్తిడికి గురవుతూ ఉంటారు.

Pushpa 2 Fame Fahadh Faasil diagnosed with ADHD at 41 recalls conversation with doctor

ఇక ఈ వ్యాధి నాకు 41 ఏళ్ళ వయస్సులో బయటపడిందని, దానికి చికిత్స తీసుకుంటున్నట్లు ఫహాద్ తెలిపాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం ఫహాద్ పుష్ప 2 సినిమాతో తెలుగు ప్రేక్షకులను మరోసారి అలరించడానికి రెడీ అవుతున్నాడు. మరి ఈ సినిమా ఆయనకు ఎలాంటి పేరును తీసుకొచ్చి పెడుతుందో చూడాలి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X