Pushpa 2 : శ్రీవల్లి వెరీ రిచ్ - ఒంటి నిండా బంగారపు నగలతో ధగధగ మెరిసిపోతున్న రష్మిక!
సోషల్ మీడియా అంతా ఇప్పుడు పుష్ప 2 హడావుడే కనిపిస్తోంది. అందుకు కారణాలు రెండు. ఒకటి అల్లు అర్జున్ పుట్టినరోజు టీజర్ రిలీజ్ చేసేందుకు డేట్ ఫిక్కైంది. రెండో నేడు(ఏప్రిల్ 5) రష్మిక పుట్టినరోజు సందర్భంగా శ్రీవల్లి లుక్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేసి సర్ప్రైజ్ ఇవ్వడం. దీంతో సోషల్ మీడియాలో పష్ప హవానే కనిపిస్తోంది. ఫ్యాన్స్ శ్రీవల్లి కొత్త పోస్టర్ను, పుష్ప 2 టీజర్ ట్యాగ్ను తెగ షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా పుష్ప 2. యాక్షన్ థ్రిల్లర్ ఇది రాబోతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి రెండు మూడు రోజులుగా రోజుకో అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్లో ఖుషిని నింపుతున్నారు మేకర్స్. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా టీజర్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ టీజర్కు అందించే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో డబుల్ ఇంపాక్ట్ ఇవ్వబోతున్నట్లు తెలిపారు మేకర్స్. దేవిశ్రీ ప్రసాద్ అందించిన ఈ సంగీతాన్ని వినేందుకు హెడ్‌ఫోన్స్ రెడీ చేసుకోండి. సెన్సేషనల్ బీజీఎం రాబోతోంది అంటూ చెప్పుకొచ్చారు. పుష్ప -1కు మించిన మ్యూజిక్ ఆల్బమ్‌ను దేవిశ్రీ ఇవ్వబోతున్నట్లు తెలిపారు.

ఇకపోతే నేడు నేషనల్ క్రష్ రష్మిక మందన్న పుట్టిన రోజు సందర్భంగా మరో స్పెషల్ సర్ప్రైజ్ కూడా ఇచ్చారు. రష్మిక శ్రీవల్లి పాత్ర లుక్‌ను ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా రిలీజ్ చేసి బర్త్డే విషెస్ తెలిపారు. ప్రస్తుతం ఈ పోస్టర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో శ్రీవల్లి పట్టుచీర కట్టుకొని, ఒంటి నిండా బంగారపు నగలు ధరించి ధగధగ మెరిసిపోతూ ఆకట్టుకుంది. చేతికి గోల్డ్ బ్యాంగిల్స్, మెడలో గోల్డ్ చైన్లు, నడుముకు బంగారంతో చేసిన వడ్డాణం.. అబ్బో ఫుల్ రిచ్ అండ్ గ్లామరస్గా కనిపించి మెప్పించింది.
ఇది చూసిన నెటిజన్లు పుష్ప మొదటి భాగం సమయంలో రిలీజ్ చేసిన రష్మిక లుక్తో పోలుస్తున్నారు. అప్పట్లో కింద కూర్చొని చెవి దిద్దులు పెట్టుకుంటూ రష్మిక కనిపించిన సంగతి తెలిసిందే. దీంతో కంపేర్ చేస్తూ శ్రీవల్లి అక్కా చానా రిచ్ అయిపోయిందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

కాగా, మే చివరి నాటికి పుష్ప 2 షూటింగ్ పూర్తి చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్ను పూర్తి చేసి తర్వాతి ప్రాజెక్ట్ కోసం సిద్ధం అవుతారని అంటున్నారు. పుష్ప1 ప్రమోషన్స్ కోసం మూవీటీమ్ ఎంతలా కష్టపడిందో ఈ సారి కూడా పూర్తి సమయాన్ని ప్రమోషన్స్ కోసం కేటాయించాలని అనుకుంటుందట. అందుకు తగిన షెడ్యూల్‌ను సిద్ధం చేస్తున్నారని తెలిసింది..


Click it and Unblock the Notifications











