Avatar 2 తో కలిసి సర్‌ప్రైజ్ ప్లాన్ చేసిన పుష్ప రాజ్.. వరల్డ్ వైడ్ వైరల్ అయ్యేలా..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్నాడు. మొదటి పార్ట్ తోనే అతనికి బాలీవుడ్ ఆడియన్స్ నుంచి మంచి సపోర్ట్ అయితే లభించింది. అంతే కాకుండా ఇంటర్నేషనల్ క్రికెటర్స్ కూడా పుష్పకు సంబంధించిన స్వాగ్ డైలాగ్స్ ను ఇమిటేట్ చేసి ఆకట్టుకున్నారు. అయితే ఇప్పుడు పుష్ప సెకండ్ పార్ట్ మరింత వైరల్ అయ్యేలా చేయాలి అని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అవతార్ 2 ద్వారా పుష్ప 2 నుంచి ఒక సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే.

షాక్ ఇచ్చిన కలెక్షన్స్

షాక్ ఇచ్చిన కలెక్షన్స్

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేసిన మూడవ చిత్రం పుష్ప అంచనాలను ఏ స్థాయిలో అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాకు మొదట కొంత నెగిటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ కూడా ఆ తర్వాత ఒక్కసారిగా సినిమాకు కలెక్షన్స్ పెరిగిపోయాయి. ముఖ్యంగా హిందీలో 100 కోట్ల నెట్ కలెక్షన్స్ అందుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

హై రేంజ్ లోనే..

హై రేంజ్ లోనే..

పుష్ప ఫస్ట్ పార్ట్ సక్సెస్ కావడంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ ను అంతకుమించి అనేలా తెరపైకి తీసుకురావాలి అని చిత్ర యూనిట్ సభ్యులు ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే కేవలం మేకింగ్ విధానంతోనే కాకుండా ప్రమోషన్స్ విషయంలో కూడా హై రేంజ్ లోనే ఆలోచిస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన ఒక బిగ్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ ప్రారంభమైన విషయం తెలిసిందే.

బిగ్ బడ్జెట్ మూవీగా..

బిగ్ బడ్జెట్ మూవీగా..

పుష్ప ఫస్ట్ పార్ట్ భారీ స్థాయిలో సక్సెస్ కావడంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ కూడా అంతకుమించి అనేలా ఈ సినిమా కోసం బడ్జెట్ కేటాయించినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా కోసం దాదాపు 250 కోట్ల వరకు ఖర్చు చేసే అవకాశం ఉన్నట్లు కూడా టాక్ అయితే వినిపిస్తోంది. ఎందుకంటే బిజినెస్ ఈజీగా 500 కోట్లు వరకు చేయబోతుంది అని అంటున్నారు.

అవతార్ 2 సినిమాతో పాటు

అవతార్ 2 సినిమాతో పాటు

ఇక సినిమాకు తగ్గట్టుగా ప్రమోషన్స్ కూడా చేయాలి అని ముందుగానే సుకుమార్ టీం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ సలహా మేరకు అవతార్ 2 సినిమాతో పాటు చాలా దేశాల్లో వైరల్ అయ్యేలా చేయాలని అనుకుంటున్నారు. అందుకోసం మైత్రి మూవీ మేకర్స్ కూడా ముందుగానే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఫస్ట్ లుక్ టీజర్

ఫస్ట్ లుక్ టీజర్

అవతార్ 2 సినిమా డిసెంబర్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అయితే వీలైనంతవరకు ఎక్కువగా ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఇంటర్వెల్ లో పుష్ప సెకండ్ పార్ట్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ లాంటిది విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు.

షూట్ కూడా ఫినిష్

షూట్ కూడా ఫినిష్

ఇప్పటికే పుష్ప 2 షూటింగ్ మొదటి షెడ్యూల్లో ఫస్ట్ లుక్ టీజర్ కు సంబంధించిన షూట్ కూడా ఫినిష్ చేసినట్లు సమాచారం. అది తప్పకుండా అది అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందట. దర్శకుడు సుకుమార్ ఈసారి పక్కా ప్రణాళికతో సినిమాను అనుకున్న సమయానికి పూర్తిచేసే పూర్తిస్థాయి ప్రమోషన్స్ తో వచ్చే ఏడాది చివర్లో విడుదల చేయాలని అనుకుంటున్నారు. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X