ఆస్పత్రిలో 'పుష్ప 2' నిర్మాత.. ఐటీ దాడుల ఎఫెక్ట్! ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందంటే?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అనేక అగ్ర నిర్మాణ సంస్థలు ఉన్నాయి. అందులో ఒకటే మైత్రీ మూవీ మేకర్స్. ఈ మధ్య కాలంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి భారీ చిత్రాలను నిర్మిస్తున్నారు. ఈ సవంత్సరం సంక్రాంతికి ఇద్దరు బడా హీరోలతో చిత్రాలు నిర్మించి మంచి హిట్ కొట్టారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప 2 మూవీతో మరో విజయం సాధించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే గత కొద్దిరోజులుగా ఈ నిర్మాతల ఇళ్లల్లో ఐటీ దాడులు జరిగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నవీన్ యెర్నేని ఆస్పత్రి పాలయ్యారు.

2021లో పుష్ప..: మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతికి ఒకరోజు వ్యవధిలోనే మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య, నటసింహం బాలకృష్ణతో వీర సింహా రెడ్డి సినిమాలను విడుదల చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు. అంతకుముందే 2021లో అల్లు అర్జున్ తో 'పుష్ప: ది రైజ్' (Pushpa) సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో బంపర్ హిట్ అందుకున్నారు.

Pushpa 2

మూడు రోజులుగా : ప్రస్తుతం 'పుష్ప: ది రూల్' (Pushpa 2) చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు నిర్మాతలు నవీన్, రవిశంకర్. ఈ చిత్రాన్ని సుమారుగా రూ. 400 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నట్లు సమాచారం. అయితే ఇటీవల మూడు రోజులుగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వీరితోపాటు డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో కూడా సోదాలు జరుపుతున్నారు.

Pushpa 2

ఆరోగ్య సమస్యలు : మైత్రి మూవీ మేకర్స్ సంస్థ సుమారుగా రూ. 700 కోట్ల వరకు వివిధ రూపాల్లో నగదు సమకూర్చుకుని జీఎస్టీ సరిగా కట్టలేదనే ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఆ కేసు విషయంలో ఐటీ అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. ఐటీ దాడులతో పుష్ప 2 షూటింగ్ ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా నవీన్ యెర్నేని అస్వస్థకు గురయ్యారు. గురువారం రాత్రి ఆయనకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు.

ఐటీ దాడుల వల్లే : ఆస్పత్రిలో చేరిన నవీన్ యెర్నేనీకి వైద్యులు మెరుగైన చికిత్స్ అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం బడా నిర్మాత నవీన్ యెర్నేని ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిన పని లేదని కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. కానీ నవీన్ యెర్నేనీ అస్వస్థకు గురి కావడం సినీ ఇండస్ట్రీలో కలకలం సృష్టించింది. ఐటీ దాడుల వల్లే ఆయన ఆరోగ్యం దెబ్బ తిందని పలువురు అనుమానిస్తున్నారు.

Pushpa 2

సెట్స్ పై సినిమాలు : మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు అయిన నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ఇళ్లలో ఇంకా ఐటీ దాడులు కొనసాగుతున్నాయని అంటున్నారు. మరి ఈ దాడులు ఎప్పుడు కొలిక్కి వస్తాయనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో పుష్ప 2తోపాటు ఖుషీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NTR31 లేదా NTR32 వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X