పుష్ప 2 సినిమా చూసి చెడిపోయారేంట్రా.. విద్యార్థులపై టీచర్ ఆగ్రహం.. ఏం జరిగిందంటే?

ప్రపంచ వ్యాప్తంగా సినిమాలు మనుషుల్ని చాలా విషయాల్లో ప్రభావితం చేస్తాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిజ జీవితంలో జరగని ఎన్నో పనులు ఎంతో అందంగా చూపించేది సినిమాలు మాత్రమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా ఇలా సినిమాలు వరల్డ్ వైడ్ ఆడియెన్స్ లో ఒక భాగంగా కూడా మారిపోయాయి. అయితే సినిమాని సినిమాలా మాత్రమే చూడాలి అని చాలా మంది చెబుతూ ఉంటారు.

ప్రేరణ పొందడం వేరు సినిమాలో ఉన్నట్టే అనుకరించడం వేరు.. ప్రేరణ చెంది ఊరుకుంటే పర్వాలేదు మంచి పనులకి అయితే అది ఇంకా పర్వాలేదు. కానీ ఇపుడు ఉన్న రోజుల్లో మంచి కంటే చెడు ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఇన్స్టంట్ ఆకర్షణలకు కూడా జనం బాగా అలవాటు పడుతున్నారు. దీనితో పలు చిత్రాలు మరింత ప్రభావం చూపిస్తున్నాయి.

Pushpa 2 School Teacher angry on Students for imitating Pushpa Raj Character

కాగా ఇటీవల మన ఇండియన్ సినిమా దగ్గరే చూసుకున్నట్టయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం పుష్ప కోసం తెలిసిందే. ఈ సినిమా మొదటి భాగం వచ్చినపుడే చాలా విమర్శలు వచ్చాయి. అంతెందుకు గరికపాటి లాంటి వారే దర్శకుడు సుకుమార్ ని సినిమా చేసినందుకు హీరో అల్లు అర్జున్ ని ఏకి పారేసారు. ఇలాంటి సినిమాలు చూసి జనం పడవవుతారని వారు చెప్పారు.

అయితే సినిమాలు సినిమాలనే చూడాలని ఫ్యాన్స్ అన్నారు కానీ నిజానికి పుష్ప 1 చూసి అప్పట్లో చాలా మంది ప్రేరణ చెంది అనుకరించడం స్టార్ట్ చేశారు. ఇలా స్మగ్లింగ్ చేసే కొందరు పుష్ప లో చూపించిన ట్రిక్స్ చూసి ఫాలో అయ్యి దొరికేసినవారు కూడా లేకపోలేరు. కాగా ఇపుడు పుష్ప 2 వంతు వచ్చింది.

అయితే పుష్ప 2 సినిమా చూసి కొందరు స్కూల్ పిల్లలు పదవుతున్నారని ఆ స్కూల్ ప్రిన్సిపాల్ స్వయంగా చెబుతున్నారు. కాగా ఇది ఎక్కడో కూడా జరిగిన ఘటన కాదట. హైదరాబాద్, యూసుఫ్ గూడా ప్రాంతంలో జరిగిందట. యూసుఫ్ గూడా ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి పిల్లలు పుష్ప సినిమాలు చూసి అందులో హీరో పాత్ర లానే డ్రెస్సింగ్ లు, హెయిర్ స్టైల్స్ చేస్తున్నారని ఆ స్కూల్ హెడ్ మాస్టర్ ఫైర్ అయ్యారట.

పుష్ప సినిమా పిల్లల భవిష్యత్తుని పాడు చేస్తుంది అని, ఒకవేళ భవిత పాడైతే అందుకు ఎవరు భాద్యులు అని అంటున్నారట. కాగా ఆ స్కూల్ హెచ్ ఎం ఆవేదనలో అర్ధం లేకపోలేదు. చిన్న వయసులో పిల్లలు దేనికైతే ఎక్కువ ప్రభావితం అవుతారో పెద్దయ్యాక కూడా అదే రకంగా మారేందుకు అవకాశాలు ఎక్కువ.

సో ఇలాంటి సినిమాలు చూసి వీరు ఇప్పుడే ఇలా ఉంటే ఇక రేపు ఎలా ఉంటుంది అని వారు భయపడుతున్నారు. ఆల్రెడీ ఇదే తెలంగాణాలో పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో ఎలాంటి కాంట్రవర్సీ జరిగిందో అందరికీ తెలిసిందే. ఇపుడు మరొకటి.. మరి పుష్ప 2 కి ఈ చిక్కులు అన్నీ ఎప్పటికి వీడుతాయి అనేది వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X