Allu Arjun: రాత్రంతా జైల్లోనే.. ఎట్టకేలకు అల్లు అర్జున్ విడుదల.. ఇంటికి వెళ్లని బన్నీ..
Allu Arjun released: ఎన్నో ట్విస్టులు, మలుపుల మధ్య హైదరాబాదులోని చంచలగూడ జైలు నుండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విడుదలయ్యారు. తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెల్ ఉత్తర్వులను పరిశీలించిన అధికారులు శనివారం తెల్లవారుజామున అల్లు అర్జున్ ను విడుదల చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా అల్లు అర్జున్ ను జైలు వెనుక గేటు నుండి విడుదల చేసి పంపించేశారు.
అయితే అల్లు అర్జున్ నేరుగా జూబ్లీహిల్స్ లోని తన ఇంటికి చేరుకుంటారని అందరూ భావించిన.. ఇంటికి వెళ్లకుండా విడుదలైన తరువాత గీత ఆర్ట్స్ ఆఫీస్ కు చేరుకున్నారు అల్లు అర్జున్. అల్లు అర్జున్ తో తన తండ్రి అల్లు అరవింద్, తన మామయ్య చంద్రశేఖర్ తోడుగా ఉన్నారు.

పుష్ప 2 సినిమా ప్రీమియం షో సమయంలో సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో శుక్రవారం మధ్యాహ్నం అల్లు అర్జున్ హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చీకటిపల్లి పోలీస్ స్టేషన్కు తరలించి అక్కడ అల్లు అర్జున్ స్టేట్మెంట్ను తీసుకున్నారు. అనంతరం గాంధీ హాస్పిటల్ కు వైద్య పరీక్షలు నిమిత్తం తరలించి అక్కడి నుండి భారీ బంధ వస్తుంది మధ్య నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు.
ఈ సమయంలో నాంపల్లి కోర్టు.. అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అల్లు అర్జున్ లాయర్లు హైకోర్టును ఆశ్రయించగా మద్యంతర బెయిల్ లభించింది. కానీ ఆ బెయిల్ ఉత్తర్వులు ఆలస్యం కావడంతో రాత్రంతా అల్లు అర్జున్ జైల్లోనే ఉండవలసి వచ్చింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం జైలు అధికారులు అల్లు అర్జున్ శనివారం తెల్లవారుజామున చంచల్ గూడా జైలు నుండి విడుదల చేశారు.
జైలు నుంచి విడుదల అనంతరం గీతా ఆర్ట్స్ ఆఫీస్ కి చేరుకున్నారు అల్లు అర్జున్.


Click it and Unblock the Notifications











