‘పుష్ప టైమ్‌లో తట్టుకోలేని కష్టాలు.. పుష్ప 2 రిలీజ్ తర్వాత చనిపోయినా పర్లేదనే ఫీలింగ్’
'పుష్ప 2 దిల్' చిత్రం తెలుగు చలన పరిశ్రమలతో పాటు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎంతటి సెన్సనేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఈ సిరీస్ కు ముందుకు వచ్చిన పార్ట్ 1 'పుష్ప : ది రైజ్' అంటూ దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్ క్రియేట్ చేసిన సంచలనం అంతాఇంతా కాదు. బాహుబలి, కేజీఎఫ్ చిత్రాలతో ఆ రేంజ్ కలిగిన చిత్రంగా 'పుష్ప' సినిమా క్రెడిట్ దక్కించుకుంది. సుకుమార్ రైటింగ్, క్రియేటివ్ డైరెక్షన్, అల్లు అర్జున్ అన్ ప్రిడెక్టెబుల్ పెర్పామెన్స్ కు ఇండియానే కాదు ప్రపంచమంతా ఫిదా అయ్యింది.
మూడేండ్ల కింద పుష్ప మేనియా అంతా ఇంతా కాదు. ఏకంగా ఇంటర్నేషనల్ గేమ్ క్రికెట్ స్టార్స్ కూడా పుష్పరాజ్ అటిట్యూడ్ ను కాపీ కొట్టారంటే ఏ రేంజ్ ఇంపాక్ట్ చూపిందో అర్థం చేసుకోవచ్చు. పొలిటిషన్స్ కూడా ప్రభావితం చేసింది. ఇలా అన్ని వర్గాల నుంచి పుష్ప చిత్రానికి మంచి మార్కులు పడ్డాయి. ఇక ఈ చిత్రం రెండో భాగం కూడా విడుదలై బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఏకంగా 1800 కోట్ల వరకు వసూళ్లు చేసి ఆశ్చర్య పరిచింది.

ఇక ఈ సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే మనం గుర్తు చేసుకోవాల్సిన వ్యక్తి జగదీష్ ప్రతాప్ బండారి.... ఇతన్ని ఇలా పిలవడం కంటే.. కేశవ అంటేనే అందరికీ తెలుస్తుంది. వాస్తవానికి ఆయన్ని కేశవ అంటేనే త్వరగా గుర్తుపట్టే పరిస్థితి. అంతా పుష్పలో సపోర్టింగ్ రోల్ కేశవకు న్యాయం చేశారు. కేశవ పాత్రలో తెలుగు ఆడియెన్స్ ను ఫిదా చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు బెస్ట్ సపోర్టింగ్ రోల్ అనిపించారు. ఏకంగా ఆయన నటనకు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ విభాగంలో సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్ కూడా దక్కింది.
ఆ క్రేజ్ తోనే వరుసగా పలు చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూనే వస్తున్నారు. నిత్యం బిగ్ స్క్రీన్ పై కనిపిస్తూ ఆడియెన్స్ కు మరింతగా దగ్గరవుతున్నారు. ఇదిలా ఉంటే.. పుష్ప చిత్రం తర్వాత జగదీష్ అరెస్ట్ కలకలం రేపిన విషయం తెలిసిందే. కెరీర్ లో మంచి హైప్ వచ్చిన వేళ ఇలాంటి ఓ ఘటన ఆయన్ని కుదిపి వేసింది. ఎట్టకేళలకు ప్రస్తుతం పరిస్థితులను చక్కదిద్దుకొని కెరీర్ లో యాక్టివ్ అవుతున్నారు. కాగా తాజాగా 'పుష్ప2 : ది రూల్' సక్సెస్ మీట్ లో ఆయన మాటలు ఆసక్తికరంగా మారాయి.
పుష్ప సినిమా తర్వాత ఆయనికి ఎన్నో కష్టాలు వచ్చాయన్నారు. ఆ కష్ట సమయంలో పుష్ప టీమ్ అంతా తనకు తోడుగా నిలిచిందని, ధైర్యం చెప్పిందన్నారు. కానీ.. పుష్ప సినిమా వరకు తన జీవితం చాలా ఇబ్బందిగా ఉండేదని.. ఒక్క పుష్ప సినిమా పూర్తి చేసి చనిపోయినా పర్లేదనుకున్నానని చెప్పారు. ఆయన కెరీర్ లో పడ్డ కష్టాలను సక్సెస్ మీట్ లో సుకుమార్ ముందుకు చెప్పుకున్నారు. తన డైరెక్టర్ సుక్కుకు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. ఇక జగదీష్ నెక్ట్స్ 'పిక్ పాకెట్ 2'తోపాటు, పలు వెబ్ సిరీస్ ల్లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











