twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Pushpa మీద ఫ్యాన్స్ ఆగ్రహం..ఫ్లెక్సీలు ధ్వంసం.. అక్కడి ఫాన్స్ కి మేకర్స్ షాక్!

    |

    ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం పుష్ప. ఈ రోజు విడుదలైన ఈ సినిమా భారీ రెస్పాన్స్ అందుకుంది. పుష్ప చిత్ర యూనిట్‏ కు ఒకపక్క శుభాకాంక్షలు వర్షం కురుస్తుంటే మరో పక్క సికింద్రాబాద్ లో ఒక అభిమాని పుష్ప కోసం స్వయంగా కట్టించిన కటౌట్ ద్వంశం చేయడం సంచలనంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

     బ్రహ్మాండమైన ఓపెనింగ్స్

    బ్రహ్మాండమైన ఓపెనింగ్స్

    ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్ అంటే ఇప్పటి వరకు కేవలం తెలుగు, మలయాళం ప్రేక్షకులకు మాత్రమే మంచి పరిచయం అనేది. కానీ పుష్ప సినిమాతో ఆయన పాన్ ఇండియా ప్రేక్షకులను పలకరించడంతో ఈ సినిమా దెబ్బకు ఇండియా వ్యాప్తంగా అభిమానులు వచ్చేలా ఉన్నారు. డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ సాధించింది.

    ఎలాంటి సందేహం లేదు

    ఎలాంటి సందేహం లేదు

    అల్లు అర్జున్ కెరీర్‌లోనే అత్యద్భుతంగా ఓపెనింగ్స్ తెచ్చుకున్న సినిమాగా పుష్ప నిలవనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా కన్నడ, తమిళ, హిందీ భాషల్లో కూడా పుష్ప సినిమాకు నీరాజనాలు పడుతున్నారు ప్రేక్షకులు. భాషా భేదం లేకుండా అల్లు అర్జున్ నటనకు అందరూ ఫిదా అయిపోతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.

    హిందీలో కూడా

    హిందీలో కూడా

    పుష్ప సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. అయితే సినిమాలో పుష్ప రాజ్ పాత్రను ఆయన పోషించిన తీరు చూసి సలాం కొడుతున్నారు. ఈ సినిమా విషయంలో ముందు నుంచి అల్లు అర్జున్ ఏదైతే చెబుతూ వస్తున్నాడో అది ఇప్పుడు ప్రేక్షకులకు అర్ధం అయింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్రతో పాటు సునీల్ పాత్రకు మంచి స్పందన వస్తోంది. హిందీలో కూడా ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది అక్కడ కూడా అల్లు అర్జున్ నటనకు ఉత్తరాది ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు.

     ఫ్లెక్సీలు ధ్వంసం

    ఫ్లెక్సీలు ధ్వంసం

    అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే బన్నీ కోసం సికింద్రాబాద్ లో భారీ ఎత్తున కట్టిన ఫ్లెక్సీలను, కటౌట్ లు సొంత ఫాన్స్ ద్వంశం చేస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి. అయితే ఎందుకు అలా చేస్తున్నారు? అనే అంశం మీద ఎలాంటి క్లారిటీ లేకపోయినా వీడియోలో మాటలను బట్టి అతను లోకల్ అల్లు అర్జున్ ఫాన్స్ ప్రెసిడెంట్ అని అంటున్నారు. అలాంటి అతను తన అభిమాన హీరో కటౌట్ ఎందుకు ధ్వంసం చేశారు అనేది తెలియాల్సి ఉంది.

    మేకర్స్ షాక్

    మేకర్స్ షాక్

    మరోపక్క మలయాళ ఫాన్స్ కు మేకర్స్ షాక్ ఇచ్చారు. దేశవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని తొలుత మేకర్స్​ భావించారు. అనుకున్న సమయానికి విడుదల చేసేందుకు చాలా శ్రమించారు కానీ మలయాళ భాషలో మాత్రం ఈ సినిమా శుక్రవారం నేడు విడుదల కాలేదు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ సినిమా డిసెంబర్​ 18న మలయాళం వెర్షన్​ విడుదలవుతుందని సమాచారం. అప్పటివరకు తమిళ భాష ప్రింట్​ను కేరళలో ప్రదర్శిస్తారని తెలుస్తోంది. సౌండ్ గ్లిచ్చెస్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

    English summary
    Pushpa cutout demolished by allu arjun fans in secundrabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X