twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పుష్ప టెక్నీషియన్ తో సుకుమార్ గొడవ.. ఇంగ్లీష్ లో అలాంటి పదం వాడటంతో ఆగ్రహం

    |

    భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప సినిమా ఊహించిన విధంగా టాక్ అందుకుంటోంది. ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకులలో అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమాకు సంబంధించిన పాటలు కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయ్యాయి. యూట్యూబ్లో మిలియన్ల సంఖ్యలో వ్యూవ్స్ రావడంతో సినిమాపై బజ్ బాగానే క్రియేట్ అయ్యింది. అయితే సినిమా షూటింగ్ టైంలో జరిగిన ఒక గొడవ గురించి దర్శకుడు సుకుమార్ ఇటీవల ప్రెస్ మీట్ లో చాలా ఓపెన్ గా తెలియజేశాడు. విదేశీ సినిమాటోగ్రాఫర్ తో సుకుమార్ చాలా సీరియస్ గా వాదోపవాదాలు జరిపినట్లు తెలియజేశారు

    ఆ విషయంలో మార్పులు చేయకుండా..

    ఆ విషయంలో మార్పులు చేయకుండా..

    క్రియేటివ్ దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సుకుమార్ ఎలాంటి సినిమా చేసినా కూడా టెక్నీషియన్స్ విషయంలో అయితే పెద్దగా మార్పులు చేయడు. తనకు నచ్చిన వారితోనే ఎక్కువగా సినిమాలు చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా మ్యూజిక్ విషయంలో దేవిశ్రీ ప్రసాద్ ను సినిమాటోగ్రఫీ రత్నవేలునీ పెద్దగా మార్చడు.

     మొదటిసారి పోలెండ్ సినిమాటోగ్రాఫర్

    మొదటిసారి పోలెండ్ సినిమాటోగ్రాఫర్

    అయితే మొదటిసారి సుకుమార్ సినిమా ఫోటోగ్రాఫర్ విషయంలో మార్పులు చేయక తప్పలేదు. రత్నవేలు మిగతా సినిమాలతో బిజీగా ఉండటం వలన ఈ అతిపెద్ద ప్రాజెక్టు కోసం సుకుమార్ పోలెండ్ సినిమాటోగ్రాఫర్ మిరస్లోవ్ కూబాను తీసుకున్నాడు. అతను ఇదివరకే గ్యాంగ్ లీడర్ సినిమాతో మైత్రి మూవీ మేకర్స్ కు చాలా క్లోజ్ అయ్యాడు. ఇక ఆ సాన్నిహిత్యం తోనే సుకుమార్ తో కూడా సినిమా చేయించేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు.

     ‘సెన్స్ లెస్' అన్నాడు

    ‘సెన్స్ లెస్' అన్నాడు

    అయితే షూటింగ్ సమయంలో అతని భాష అర్థం కాక దర్శకుడు సుకుమార్ చాలా సీరియస్ అయినట్లు ఇటీవల నిర్వహించిన ప్రెస్ మీట్లో తెలియజేశాడు. నాకు ఇంగ్లీష్ కూడా అంత పెద్దగా రాదు. అతను కూడా దాదాపు అదే తరహాలో ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. అయితే నేను ఒకసారి షాట్ విషయంలో ప్లీజ్ లెన్స్ చేంజ్ చేయాలి అని ఇంగ్లీషులో చెప్పాను. షూటింగ్‌లో 'చేంజ్ ద లెన్స్' అన్నప్పుడు అతను 'సెన్స్ లెస్' అని అన్నాడు.

    చాలా హర్ట్ అయ్యాను..

    చాలా హర్ట్ అయ్యాను..

    'సెన్స్ లెస్' అనడంతో నేను చాలా హర్ట్ అయ్యాను. ఆ తర్వాత అతన్ని పక్కకు తీసుకువెళ్లి చాలా సీరియస్ గా హెచ్చరిక కూడా చేశాను నేను ఎంత పెద్ద డైరెక్టరో నీకు తెలుసా? నేను ఎలాంటి సినిమాలు చేశానో తెలుసా.. అని చాలా బాగా కోపానికి గురయ్యాను. ఇక అతను ఏమి మాట్లాడలేదు. కళ్ళల్లో మాత్రం నీళ్ళు కనిపించాయి. ఒకరి భావాలు మరొమారికి అర్థం కాని పరిస్థితుల్లో అతను చాలా ఫీల్ అయినట్టు అనిపించింది.. అని సుకుమార్ అన్నాడు.

    ఆ తరువాత అర్థం చెప్పడంతో..

    ఆ తరువాత అర్థం చెప్పడంతో..

    ఇక కొద్దిసేపటి అనంతరం డోర్ కొట్టి నట్టు అనిపించింది నేను తలుపు తెరిచాను. ఆ సమయంలో కుబా దాని అసలైన అర్థం గురించి వివరణ ఇచ్చాడు. అది సెన్స్ లెస్ కాదని చేంజ్ ద లెన్స్ అని చెప్పాడు. పలికే విధానంలో తేడా కొట్టినట్లు అనిపించింది. ఇక వెంటనే నా పొరపాటు తెలుసుకొని చాలా సరదాగా వర్క్ ని కొనసాగించాము. మళ్ళీ ఆ తరువాత మా ఇద్దరి మధ్యలో ఎలాంటి గొడవలు జరగలేదు. బాషా అర్థం కాకపోయినా కూడా సినిమా మా ఇద్దరితో పని పూర్తయ్యేలా చేసింది.. అని సుకుమార్ తెలియజేశారు.

    English summary
    Pushpa director serious situation with cinematographer in shooting,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X