అప్డేట్ అంటూ ఆశలు రేకెత్తించారు.. ‘పుష్ప’పై ఆకలి మీదున్న బన్నీ ఫ్యాన్స్

ప్రస్తుతం సోషల్ మీడియాలో పుష్ప ట్రెండింగ్‌లో ఉంది. నిన్న కూడా పుష్ప హ్యాష్ ట్యాగ్ నేషనల్ వైడ్‌గా టాప్ ప్లేస్‌లో ట్రెండ్ అయింది. దానికి ఓ కారణం ఉంది. నిన్న బన్నీ రాజమండ్రికి బయల్దేరాడు. పుష్ప సినిమా షూటింగ్ కోసం బన్నీ రెడీగా ఉన్నాడు. రేపుటి ఉభయ గోదావరి జిల్లాలో ఈ మూవీ చిత్రం ప్రారంభం కాబోతోన్నట్టు తెలుస్తోంది. అలా నిన్న హైద్రాబాద్ నుంచి రాజమండ్రికి బన్నీ బయల్దేరుతున్నాడని తెలియడంతో పుష్ప హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది.

రాజమండ్రలో పిక్స్ వైరల్..

రాజమండ్రలో పిక్స్ వైరల్..


రాజమండ్రి ఎయిర్ పోర్ట్‌లో బన్నీ దర్శనమిచ్చిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి. షార్ట్ వేసుకుని టీ షర్ట్ ధరించి కూల్‌గా అలా వచ్చాడు. బన్నీ రాబోతోన్నాడన్న సమాచారం ముందుగానే రావడంతో అక్కడ అందరూ గుమిగూడారు. రాజమండ్రి ఎయిర్ పోర్ట్ మొత్తం సందడిగా మారింది.

పుష్ప చిత్రం కోసం..

పుష్ప చిత్రం కోసం..


అసలే కరోనా వల్ల పుష్ప చిత్రం ఘోరంగా వెనుకపడింది. కరోనా కంటే ముందు కేరళ అడవుల్లో సందడి చేసిన పుష్ప టీం ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసింది. కానీ అందులో అల్లు అర్జున్ జాయిన్ అవ్వలేదు. తీరా బన్నీ జాయిన్ అయ్యే సమయానికి కరోనా దెబ్బ కొట్టింది. దాదాపు ఆరేడు నెలల తరువాత మళ్లీ పుష్ప టీం సెట్స్ పైకి వెళ్లనుంది.

అప్డేట్ అంటూ..

అప్డేట్ అంటూ..

పుష్ప నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీస్ నేటి ఉదయం ఓ ట్వీట్ చేస్తోంది. మరి కొద్ది క్షణాల్లోనే పుష్ప అప్డేట్ రాబోతోందని ప్రకటించింది. ఈ మేరకు మైత్రీ మూవీస్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. క్షణాల్లో పుష్ప ట్రెండింగ్‌లోకి వచ్చింది. అభిమానులు ఎంతోఆశగా ఎదురుచూస్తుండిపోయారు.

Recommended Video

Director Sukumar Spending 6Cr For 6 Minutes Episode In Pushpa
రేపు అంటూ ఆశలు ఆవిరిచేశారు..

రేపు అంటూ ఆశలు ఆవిరిచేశారు..

అయితే అలా కొద్ది సేపట్లో అప్డేట్ రాబోతోందని ప్రకటించిన మైత్రీ.. రేపు (నవంబర్ 9) ఉదయం పది గంటలకు ప్రీ ప్రొడక్షన్ గ్లింప్స్, షూటింగ్ అప్టేడ్స్ ఇస్తామని ట్వీట్ చేసింది. అప్డేట్ అంటే ఇలాంటి అప్డేట్ ఇస్తారని అనుకోలేదు.. పోనీ ఏదో ఒకటి ఇచ్చారంటూ అభిమానులు రేపటి కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అప్డేట్ గురించి అప్డేట్ ఇవ్వడంతో పుష్ప ట్విట్టర్‌లో ట్రెండ్అవుతూనే ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X