Pushpa Event: ఆ కష్టం చూశాక భారతదేశంలో ఇలాంటి నటుడు లేడని అనిపించింది: కొరటాల శివ

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరపైకి రాబోతున్న పుష్ప సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ వేడుక కోసం రెండు రాష్ట్రాల నుంచి వేలాది మంది అభిమానులు వచ్చారు. అయితే ఈ వేడుకకు ప్రత్యేక అతిథులుగా దర్శకుడు రాజమౌళి అలాగే మరికొంతమంది ఇండస్ట్రీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఇక దర్శకుడు కొరటాల శివ తన మాటలతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు.

 చాలా ధైర్యం ఉండాలి..

చాలా ధైర్యం ఉండాలి..

కొరటాల శివ మాట్లాడుతూ.. పుష్ప లాంటి సినిమా తీయాలి అంటే నిజంగా చాలా ధైర్యం ఉండాలి. ఇలాంటివి పాత్రలను కూడా క్రియేట్ చేయాలి అంటే అంత సాధారణమైన విషయం కాదు. ఇది సాధ్యమైంది అంటే అది ఒక సుకుమార్ లాంటి వ్యక్తి కే సాధ్యమవుతుంది. ఇక శుక్రవారం మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు కూడా అదే కమిట్మెంట్ వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఇంత ఫంక్షన్ జరుగుతుంది కూడా ప్రస్తుతం బాంబే లో తన ఫైనల్ కట్ కోసం కష్టపడుతున్నాడు అంటే నిజంగా ఆయనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అని అన్నారు.

ఎంతగా హార్డ్ వర్క్ చేశారో అర్థమవుతోంది...

ఎంతగా హార్డ్ వర్క్ చేశారో అర్థమవుతోంది...

ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే అది సుకుమార్ మాట్లాడుతున్నట్లే అనుకోండి.. మా మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాకు ఎంతో కష్టపడ్డారు. వాళ్లు సినిమా ఇండస్ట్రీలో మరి కొన్నాళ్ళ పాటు ఇంకా మంచి సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. సినిమాకు వర్క్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడ్డారు అనిపిస్తోంది. ముఖ్యంగా కెమెరామెన్ కుబా గారు ఎంతగా హార్డ్ వర్క్ చేశారో అర్థమవుతోంది. అలాంటి అడవులలో వర్క్ చేయడం అంటే అంత సాధారణమైన విషయం కాదు. మేము కూడా కొన్నాళ్ళు అక్కడే వర్క్ చేశాం.. అని కొరటాల తెలిపారు.

 క్రెడిట్ అంతా కూడా ఆయనకే..

క్రెడిట్ అంతా కూడా ఆయనకే..

రష్మిక మందన్న, సునీల్, అనసూయ వంటి వారు కూడా ఈ సినిమాలో చాలా ప్రత్యేకం గా కనిపిస్తున్నారు. వారి పాత్రలే వెండితెరపై కనిపిస్తున్నాయి. క్రెడిట్ అంతా కూడా సుకుమార్ కే చెందుతుంది. ఇక ప్రతి సినిమాకు కూడా అల్లు అర్జున్ మారుతున్న విధానానికి నేను పెద్ద ఫ్యాన్స్ అవుతున్నాను. ఇలాంటి నటుడు భారత దేశంలోనే లేడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు..అని తెలిపారు.

Recommended Video

Multi Starrer Movie With Mahesh Babu, Ram Charan ? || Filmibeat Telugu
పెద్ద కథతో వస్తాను..

పెద్ద కథతో వస్తాను..

మేము ఇద్దరం ఎక్కడ కూర్చున్నా కూడా సినిమా గురించి ఎక్కువగా మాట్లాడుతూనే ఉంటాము. బన్నీతో మీటింగ్ చాలా బావుంటుంది. ఇక పుష్ప సినిమా కోసం ఎవరు కూడా ఈ స్థాయిలో ప్రాణం పెట్టి నటించే వారు కాదేమో.. అంతలా బన్నీ హార్డ్ వర్క్ చేశాడు. పుష్ప కోసం అలాగే మీ కోసం విడుదల తేదీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. తప్పకుండా పుష్ప సినిమా తర్వాత ఇంతకంటే పెద్ద కథతో మీ వద్దకు వస్తాను.. అని వివరణ ఇచ్చిన కొరటాల శివ ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను అని తెలియజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X