Pushpa Event: ఆ రోజే అనుకున్నా బన్నీతో నటించాలని.. అదే నిజమయ్యింది..: రష్మీక మందన్న లవ్లీ స్పీచ్
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరపైకి రాబోతున్న పుష్ప సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ వేడుక కోసం రెండు రాష్ట్రాల నుంచి వేలాది మంది అభిమానులు వచ్చారు. అయితే ఈ వేడుకకు ప్రత్యేక అతిథులుగా దర్శకుడు రాజమౌళి అలాగే మరికొంతమంది ఇండస్ట్రీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఇక సినిమాలో శ్రీవల్లిగా నటించిన హీరోయిన్ రష్మీక మందన్న తన మాటలతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు.

తొందరగా మాట్లాడి వెళ్ళిపోతాను..
రష్మీక మందన్న మాట్లాడుతూ.. చాలా కాలం తర్వాత ఇలాంటి అతిపెద్ద వేడుకల్లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే అభిమానం చూసి కూడా చాలా రోజులు అయింది. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరందరూ బన్నీ గారి స్పీచ్ కోసం ఎదురు చూస్తున్నారు అని అర్థం అయింది. కాబట్టి నేను తొందరగా మాట్లాడి వెళ్ళిపోతాను అని ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన అతిధులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.. అని రష్మీక వివరణ ఇచ్చారు.

ఆ రోజే అనుకున్నా..
కరోనా పరిస్థితులను ఎదుర్కొన్న తర్వాత పుష్ప సినిమా థియేటర్స్ లో విడుదల చేస్తున్నాము.. అందుకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా నిర్మాతలకు స్పెషల్ గా థాంక్స్. అల్లు అర్జున్ తో నటించాలి అని గీత గోవిందం ఆడియో రిలీజ్ వేడుకలో అని అనుకున్నాను. కానీ ఇంత త్వరగా పుష్ప గా శ్రీవల్లి గా కనిపిస్తారు అని అనుకోలేదు.. ఆయనతో వర్క్ చేయడం అంటే చాలా ఇష్టపడతాను.. అని రష్మీక మాట్లాడారు.

బన్నీ లవ్ యూ..
ఇక అభిమానులందరినీ పలకరించినా రష్మిక మందన బన్నీ ఐ లవ్ యూ అనడంతో అందరూ ఒక్కసారిగా అరిచేశారు. ఇక పుష్ప కోసం మీ అందరితో పాటు మేము కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము అంటూ అలాగే మేము ఇంకా పుష్పం సెకండ్ పార్ట్ కూడా పూర్తి చేయాల్సి ఉంది అని దాన్ని కూడా పూర్తి చేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాము అని తెలియజేసింది.

పేరెంట్స్ కు దూరంగా...
ఇక సుకుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాల్సి ఉంది. ఇక దాదాపు రెండు నెలల పాటు నేను నా పేరెంట్స్ చూడలేదు. అయితే నన్ను దత్తత తీసుకోవాలని అందుకు సంతకం కూడా పెట్టాలి అని సుకుమార్ గారిని అడిగినట్లు రష్మిక సరదాగా వివరణ ఇచ్చింది. ఈ సినిమా కోసం చాలా రోజుల గ్యాప్ లేకుండా వర్క్ చేసినట్లు కూడా ఆఖరికి తన పేరెంట్స్ ని చూడడానికి కూడా రెండు నెలలు సమయం పట్టినట్లు వివరణ ఇచ్చింది.
Recommended Video

క్యారెక్టర్స్ మాత్రమే చూస్తారు
మైత్రి మూవీ మేకర్స్ లాంటి వారితో వర్క్ చేయాలని నాకు ఎప్పుడు ఆసక్తిగానే ఉంటుంది. వారి బ్యానర్ అంటే నాకు హోమ్ బ్యానర్ లాంటిది. ఈ సినిమాకు కేవలం అల్లు అర్జున్ మాత్రమే కాకుండా నా గురించి కూడా కొంతమంది అభిమానులు వస్తారు అని అనుకుంటున్నాను. కాని ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాలో మమ్మల్ని చూడరు ఆ క్యారెక్టర్స్ లోకి ఈజీగా కనెక్ట్ అవుతారు. ఇక సినిమాకు వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను.. అని రష్మీక మాట్లాడారు.


Click it and Unblock the Notifications











