Pushpa Event: మిగతా భాషల్లో డౌట్ లేదు.. కానీ ఇక్కడే నాకు డౌట్.. దయచేసి అలా చూడకండి: సునీల్
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరపైకి రాబోతున్న పుష్ప సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన ఈ వేడుక కోసం రెండు రాష్ట్రాల నుంచి వేలాది మంది అభిమానులు వచ్చారు. అయితే ఈ వేడుకకు ప్రత్యేక అతిథులుగా దర్శకుడు రాజమౌళి అలాగే మరికొంతమంది ఇండస్ట్రీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఇక పుష్ప సినిమాలో మంగళం శ్రీనుగా నటించిన సునీల్ తన మాటలతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు.

మంచి ఫుల్ మీల్స్ లాంటి సినిమా..
సునీల్ మాట్లాడుతూ.. ఈరోజు నేను సినిమా లో విలన్ గా నటించాను అంటే అందుకు కారణం సుకుమార్ గారు. అల్లు అర్జున్ గారు కూడా నా పాత్రకు ఎంతగానో సపోర్ట్ చేశారు. వారి వల్లే ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేసే అవకాశం నాకు దక్కింది. గతంలో నేను ఇదే ప్లేస్ లో నిలబడి అల.. వైకుంఠపురం సినిమా ఆడియో వేడుకలో ఒక మాట చెప్పాను. మంచి ఫుల్ మీల్స్ లాంటి ఒక సినిమాలు చూస్తారు అని చెప్పడం జరిగింది.

అంతకుమించి ఉంటుంది
అల.. వైకుంఠపురములో.. పూర్తిగా ఒక పెళ్లి భోజన తరహాలో ఉంటుంది. మీరు కేవలం టికెట్ కొనుక్కొని వస్తే చాలు అని చెప్పడం జరిగింది. నేను చెప్పిందే చివరికి నిజం అయింది. ఇక ఇప్పుడు పెళ్లి తర్వాత పుష్ప రిసెప్షన్ వేడుక లాంటిది పెళ్లి భోజనం కంటే కూడా ఈ పుష్ప సినిమా అంతకుమించి అనేలా ఉంటుంది. ఇది కూడా చెబుతున్నాను నిజం అవుతుంది. అని సునీల్ మాట్లాడాడు.

నా కోరిక నెరవేరింది.
ఈ సినిమా చూసిన తర్వాత కొన్ని రోజుల పాటు మీరు ఆ వాతావరణం ఆలోచనలోనే ఉంటారు. నటించిన వారందరు కూడా గుర్తుకు వస్తారు. నేను విలన్ గా కనిపించడానికి ముందు ఒక ఒక మూడు వందల సినిమాలు కమెడియన్ గా చేసి మళ్లీ ఆ తర్వాత పది సినిమాల్లో హీరోగా చేసి ఆ తర్వాత గాని విలన్ గా చేసే అవకాశం రాలేదు. పుష్ప సినిమా ద్వారా నా కోరిక నెరవేరింది అందుకు సుకుమార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.. అని సునీల్ చెప్పాడు.

మీకు దండం పెడతాను..
మీరందరూ కూడా బన్నీ గారి సినిమా కి వెళ్ళినప్పుడు బన్నీ గారి ఫోటో పట్టుకొని వెళ్ళండి. నన్ను ఇంతకుముందు సినిమాల్లో గుర్తు పెట్టుకుని ఈ సినిమాను చూడవద్దు. దయచేసి మీకు దండం పెడతాను. ఈ సినిమాకు మాత్రమే నన్ను చాలా ఫ్రెష్ గా చూడండి. ఒకవేళ సినిమా చూస్తున్నప్పుడు. సునీల్ అనే వ్యక్తి మీకు గుర్తుకు వస్తే మీ వెంట తెచ్చుకున్న బన్నీ గారి ఫోటోలు చూడండి. నన్ను మాత్రం ఈసారి కొత్త వాడి లాగా చూడండి.. అని అన్నాడు.
Recommended Video

భయపెడతాను..
మీరు నన్ను కొత్తగా చూస్తేనే నేను కూడా కొత్తగా చేయగలను. మిగతా భాషల్లో అయితే నాకు టెన్షన్ లేదు. ఎందుకంటే నన్ను వాళ్ళందరూ డైరెక్ట్ గా విలన్ అనుకుంటారు. కానీ నాకు మాత్రం ఇక్కడ టెన్షన్ గా ఉంది. ఈ సినిమా వరకు నేను కొంత భయపెడతాను అనుకుంటున్నాను. ఆ తర్వాత నవ్విస్తాను. ఈసారికి భరించండి అంటూ సునీల్ వివరణ ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











