పుష్పకు రాబోయే గెస్టుల పేర్లపై కుండబద్దలు కొట్టిన నిర్మాతలు.. అభిమానులకు షాక్!
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న బెస్ట్ పాన్ ఇండియా సినిమాల్లో పుష్ప కూడా హాట్ టాపిక్ గా నిలుస్తోంది. RRR, రాధేశ్యామ్ సినిమా అనంతరం అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా పై కూడా ఓ వర్గం ప్రేక్షకుల అంచనాలు అయితే గట్టిగానే పెంచుకున్నారు. సుకుమార్ లాంటి దర్శకుడు మొదటిసారి చేస్తున్న పాన్ ఇండియా సినిమా కాబట్టి తప్పకుండా సినిమా డిఫరెంట్ గా ఉంటుంది అని అంచనాలు పెంచుకొంటున్నారు. ఇక డిసెంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 12వ తేదీన గ్రాండ్ గా నిర్వహించాలని అనుకుంటున్నాను అయితే ఆ వేడుకకు అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి.. ఇక మొత్తానికి చిత్ర నిర్మాతలు రాబోయే గెస్టుల పేర్లపై కూడా కుండ బద్దలు కొట్టినట్లుగా క్లారిటీ అయితే ఇచ్చేశారు.

మరో లెవెల్ లోనే ఉంటుందని..
సుకుమార్ దేవి శ్రీ ప్రసాద్ కాంబో అంటేనే సినిమా ఒక లెవెల్లో ఉంటుంది.. దానికితోడు అల్లు అర్జున్ కాంబినేషన్ అంటే సినిమా మరో లెవెల్ లోనే ఉంటుందని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ అలాగే పోస్టర్స్ కూడా ప్రేక్షకుల్లో ఓ పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నాయి. అంతేకాకుండా దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలు కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

ప్రీ రిలీజ్ ఈవెంట్..
అయితే పుష్ప సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఈ ఆదివారం హైదరాబాద్ లోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ వేడుకను భారీ స్థాయిలో నిర్వహించాలని చూస్తున్నారు. అయితే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నట్లు అనేక రకాల కథనాలు వెలువడ్డాయి.

ఎవరు రావడం లేదని..
కేవలం చిరంజీవి మాత్రమే కాకుండా ప్రభాస్ సల్మాన్ ఖాన్ కూడా వస్తున్నారని గతంలో కూడా చాలా రకాల కథనాలు వెలువడ్డాయి. అయితే ఆ విషయంలో మొత్తానికి చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ చేశారు. ఇటీవల చిత్ర నిర్మాతలు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫ్రీ రిలీజ్ వేడుకకు ప్రత్యేకంగా ఎవరు రావడం లేదు అని క్లారిటీ ఇచ్చేశారు. చిత్ర యూనిట్ సభ్యులు అందరూ కూడా ఈ వేడుకలో పాల్గొంటారని కూడా మైత్రి మేకర్స్ అధినేతలు క్లారిటీ ఇచ్చారు.

అల్లు అర్జున్ ఒక్కడే..
పుష్ప ప్రీ రిలీజ్ వేడుకకు ఏ అగ్రహీరో రావడం లేదని తెలియడంతో ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఒక విధంగా అల్లు అర్జున్ ఒక్కడే సినిమాను జనాల్లోకి తీసుకువెళ్లాలి అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే సినిమాపై కొంత నెగెటివ్ టాక్ అయితే ఉంది. అల్లు అర్జున్ బాగానే కష్టపడినప్పటికీ దర్శకుడు సుకుమార్ అనుకున్నంత స్థాయిలో సినిమాను తెరకెక్కించలేదు అని అపోహలు కూడా వెలువడుతున్నాయి. ఇక ఈ సమయంలో అల్లు అర్జున్ ఎవరి సపోర్టు లేకుండా సినిమాను జనాల్లోకి తీసుకువెళ్లాలి అనుకుంటున్నట్లుగా రూమర్స్ వస్తున్నాయి. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ టు అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











