Pushpa ట్రైలర్ టీజ్.. సినిమా మీద ఆసక్తి పెంచేస్తున్న తాజా కట్.. ట్రైలర్ వచ్చేది అప్పుడేనట!
అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వీరి కాంబోలో ఆర్య, ఆర్య 2 లాంటి సూపర్ హిట్ సినిమాలు అందించడంతో ఈ సినిమా ప్రారంభమైన నాటి నుంచి సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమా నుంచి ట్రైలర్ టీజ్ అంటూ చిన్న బిట్ ఒకదానిని విడుదల చేశారు ఆ వివరాల్లోకి వెళితే..

అంచనాలను పెంచేస్తూ
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే మలయాళం స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అనసూయ, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల అయిన లుక్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మునుపెన్నడూ లేని విధంగా
మునుపెన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా అల్లు అర్జున్ ఒక డీ గ్లామర్ లుక్ లో కనిపిస్తున్నారు. అలాగే ఇప్పటివరకు నటించని విధంగా ఈ సినిమాలో నటించబోతున్నాడు అంటూ ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే ఒక లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తిగా చిత్తూరు జిల్లా నేపథ్యంలో అక్కడి శేషాచలం అడవుల్లో జరుగుతోంది.

17నే సినిమా రిలీజ్
ఇప్పటికే ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మొదటి భాగం డిసెంబర్ 17న విడుదల కాబోతోందని ప్రకటించగా మళ్ళీ డేట్ మారే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే అది నిజం కాదని 17నే సినిమా రిలీజ్ అవుతుందని క్లారిటీ వచ్చేసినట్టే.

పుష్ప ట్రైలర్
మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని చెబుతూ దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చారు. ముందు నుంచి డిసెంబర్ మొదటి వారంలో పుష్ప ట్రైలర్ ను విడుదల చేయనున్నారని ఫిలిం సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దాన్ని నిజం చేసింది సినిమా యూనిట్.
Recommended Video

పుష్ప ట్రైలర్ టీజ్ అంటూ
అయితే ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ డిసెంబర్ 6న రిలీజ్ చేయబోతున్నారని చెబుతూ ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేశారు. తాజాగా ఆ ట్రైలర్ కు సంబంధించిన టీజ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. 27 సెకెన్ల నిడివితో విడుదల అయిన ఈ టీజ్ లో డిఫరెంట్ గా ఉన్న యాక్షన్ సీన్స్ కు సంబంధించి కట్స్ చూపించారు మేకర్స్. ఈ సినిమా ట్రైలర్ ను డిసెంబర్ మొదటివారంలో దుబాయ్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు అని ప్రచారం జరగగా దుబాయ్ ప్లాన్స్ అయితే వాయిదా వేసినట్టే. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.


Click it and Unblock the Notifications











