Pushpa ట్రైలర్ కూడా రెడీ.. కీలక ప్రకటన చేసిన యూనిట్!

అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే సినిమా చేస్తున్నారు. గతంలో వీరి కాంబోలో ఆర్య, ఆర్య 2 లాంటి సూపర్ హిట్ సినిమాలు అందించడంతో ఈ సినిమా ప్రారంభమైన నాటి నుంచి సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా అల్లు అర్జున్ ఒక డీ గ్లామర్ లుక్ లో కనిపిస్తున్నారు. అలాగే ఇప్పటివరకు నటించని విధంగా ఈ సినిమాలో నటించబోతున్నాడు అంటూ ముందు నుంచి ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే ఒక లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా పూర్తిగా చిత్తూరు జిల్లా నేపథ్యంలో అక్కడి శేషా చలం అడవుల్లో జరుగుతోంది.

ఈ సినిమాలో ఆయన ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే ఒక లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తున్నాడని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాను రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మొదటి భాగం డిసెంబర్ 17న విడుదల కాబోతుందని ప్రకటించగా మళ్ళీ డేట్ మారే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే అది నిజం కాదని 17నే సినిమా రిలీజ్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. ఐదు భాషల్లో ఏక కాలంలో విడుదల కాబోతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Pushpa the rise trailer update to release on 29th november

ఇక ఫహాద్ ఫాజిల్, సునీల్, యాంకర్ అనసూయ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో మెయిన్ విలన్ ఫహద్ ఫాసిల్ అంటూ ప్రచారం జరుగుతూ ఉండగా అది నిజం కాదని మొదటి భాగం చివర్లో ఆయన వస్తాడు అని సునీలే సినిమాలో మెయిన్ విలన్ అని సుకుమార్ తేలింది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన సునీల్ మంగళం శ్రీను లుక్, అలాగే అనసూయ దాక్షాయణి లుక్ కూడా సినిమా మీద అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి. ఈ సినిమాలో ఈ ఇద్దరు భార్యాభర్తలుగా నటిస్తున్న కారణంగా సినిమా మీద ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమా ట్రైలర్ ను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని చెబుతూ రేపు అప్డేట్ ఇస్తున్నట్టు ప్రకటించారు. ఇక డిసెంబర్ మొదటి వారంలో పుష్ప ట్రైలర్ ను విడుదల చేయనున్నారని ఫిలిం సర్కిల్స్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా ట్రైలర్ ను డిసెంబర్ మొదటివారంలో దుబాయ్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు అని ప్రచారం జరుగుతోంది. చూడాలి ఇందులో నిజానిజాలు ఏమేరకు ఉన్నాయనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X