Pushpa : అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. టీవీలోకి పుష్ప.. ఎప్పటి నుంచి అంటే?

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే సినిమా ప్యాన్ ఇండియా లెవెల్ లో డిసెంబర్ 17న విడుదలై మంచి ఆదరణ పొందింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఈ సినిమా గురించి తాజా విశేషం ఏమంటే.. ఈ సినిమా అతి త్వరలో టీవీలో ప్రసారం కానుంది. ఈ సినిమా టీవీలో ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది? అనే వివరాల్లోకి వెళితే..

దేశవ్యాప్తంగా ట్రెండ్

దేశవ్యాప్తంగా ట్రెండ్


సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా 2021 డిసెంబర్ 17న విడుదలైంది. అల్లు అర్జున్, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లు. ఫహాద్​ ఫాజిల్​, సునీల్​, రావు రమేష్​, అనసూయా సహా పలువురు కీలక పాత్రలు పోషించారు. సుకుమార్​ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా పాటలు కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే.

 వసూళ్లు కూడా బాగానే

వసూళ్లు కూడా బాగానే


వచ్చిన పుష్ప చిత్రం విడుదలకు ముందు భారీ బిజినెస్ చేసింది. ఏపీ, తెలంగాణలో 102 కోట్ల రూపాయల మేరకు, కర్ణాటకలో 9 కోట్లు, తమిళనాడులో 6 కోట్లు, కేరళలో 4 కోట్లు, హిందీలో 10 కోట్లు, మిగితా రాష్ట్రాల్లో 1.15 కోట్లు, ఓవర్సీస్‌లో 13 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దాంతో ఈ చిత్రం ఓవరాల్‌గా 144.90 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదు చేసింది. అలాగే వసూళ్లు కూడా బాగానే రాబట్టింది.

85.35 కోట్ల షేర్

85.35 కోట్ల షేర్


పుష్ప సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ విషయానికి వస్తే నైజాం- 40.4 కోట్లు, సీడెడ్​- రూ.15.17 కోట్లు, ఉత్తరాంధ్ర- రూ.8.13 కోట్లు, ఈస్ట్​- రూ.4.89 కోట్లు, వెస్ట్​- రూ.3.95 కోట్లు, గుంటూర్​- రూ.5.13 కోట్లు, నెల్లూరు​- రూ.3.08 కోట్లు సాధించింది. అలా తెలంగాణ ఆంధ్రాలో కలిపి మొత్తం రూ.85.35 కోట్ల షేర్, గ్రాస్​ రూ.133.25 కోట్లు రాబట్టింది పుష్ప ది రైజ్​.

 360 కోట్లు గ్రాస్

360 కోట్లు గ్రాస్


అలా ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే కర్ణాటక- 11.81 కోట్లు, తమిళనాడు- రూ.13.75 కోట్లు, కేరళ- రూ.5.60 కోట్లు, హిందీ వెర్షన్​- రూ.51.30 కోట్లు, రెస్టాఫ్ ఇండియా -రూ.2.25 కోట్లు ఓవర్​సిస్​ షేర్​- రూ.14.56 కోట్లు మొత్తం వరల్డ్​ వైడ్​ కలెక్షన్స్​ రూ.184.62 కోట్లు సాధించింది. మొత్తం గ్రాస్ 360 కోట్లు కలెక్ట్ చేసింది

ప్రిమియర్‌కు టైమ్ ఫిక్స్

ప్రిమియర్‌కు టైమ్ ఫిక్స్


అదలా ఉంచితే ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రిమియర్‌కు టైమ్ ఫిక్స్ అయ్యింది.. పుష్ప శాటిలైట్స్ రైట్స్‌ను దక్కించుకున్న స్టార్ మా.. ఈ సినిమాను మార్చి 13న సాయంత్రం ఆరు గంటలకు టెలికాస్ట్ చేయనుంది. ఈ విషయాన్ని పుష్ప టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఈ వార్త బయటకు రావడంతో దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమా తెలుగుతో పాటు కన్నడ భాషల్లో పుష్ప మార్చిలో టెలికాస్ట్‌కు రెడీ అవుతుండగా తమిళ్, మలయాళీ భాషల్లో మాత్రం ఏప్రిల్ మొదటి వారంలో టెలికాస్ట్ కానుందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X