Jawan మూవీపై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు.. షారూక్ కోసం కోరుకున్నా.. అతడు గర్వపడేలా చేశాడంటూ!
దాదాపు రెండు మూడు వారాల నుంచి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్‌లో ట్రెండ్ అవుతూ హాట్ టాపిక్‌గా మారిన చిత్రాల్లో 'జవాన్' ఒకటి. అంతలా ఈ చిత్రం ఇండియన్, ఓవర్సీస్ మార్కెట్లపై ప్రభావాన్ని చూపిస్తూ వచ్చింది. బాలీవుడ్ బాద్‌షా షారూక్ ఖాన్ నటించిన ఈ సినిమా సందేశాత్మక కథతో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
బాలీవుడ్ స్టార్ షారూక్ ఖాన్ హీరోగా.. కోలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అట్లీ రూపొందించిన సినిమానే 'జవాన్'. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీకి అమెరికాలోని ప్రీమియర్స్ నుంచే మంచి టాక్ వచ్చింది. అందుకు అనుగుణంగానే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి స్పందన భారీ స్థాయిలోనే వచ్చింది. ఫలితంగా వారంలోనే రూ. 650 కోట్లు గ్రాస్ వచ్చింది.

బాక్సాఫీస్ బెండు తీసేలా దూసుకుపోతోన్న 'జవాన్' మూవీకి షారూక్ ఖాన్ అభిమానులతో పాటు సినీ ప్రముఖులు సైతం ఫిదా అవుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఇండియా వ్యాప్తంగా ఉన్న చాలా మంది స్టార్లు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం 'జవాన్' మూవీపై తన రివ్యూను చెబుతూ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేశాడు.
అల్లు అర్జున్ చేసిన ట్వీట్‌లో 'ఎవరూ ఊహించనంత బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న జవాన్ మూవీ టీమ్‌కు అభినందనలు. ఈ సినిమా కోసం పని చేసిన నటీనటులు, టెక్నీషియన్లు, నిర్మాతలకు శుభాకాంక్షలు. ఈ మూవీలో షారూక్ గారు గతంలో చూడని మాస్ అవతారంలో కనిపించారు. దీని కోసం ఎన్నో ప్రార్థనలు చేశాం. చాలా హ్యాపీగా ఉంది సార్' అని అన్నాడు.

అదే ట్వీట్‌లో అల్లు అర్జున్ 'జవాన్ సినిమాలో విజయ్ సేతుపతి గారు ఎప్పటి లాగే అద్భుతంగా నటించారు. దీపికా పదుకొనే అందం, ప్రభావంతంగా ఇందులో కనిపించింది. నయనతార జాతీయ స్థాయిలో మెరిసింది. అనిరుథ్ మీరు మీ సంగీతంతో దేశం మొత్తాన్ని ఊపేశారు. మేమంతా గర్వపడేలా, ఓ ఆలోచింపజేసే కమర్షియల్ సినిమాను తీసి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర చరిత్ర సృష్టించినందుకు అట్లీ గారికి ధన్యవాదాలు' అని చెప్పుకొచ్చాడు. బన్నీ చేసిన ట్వీట్‌తో షారూక్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
ఇక, 'జవాన్' మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించారు. ఇందులో నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి వంటి ప్రముఖులు కీలక పాత్రలు చేశారు. దీపిక పదుకొనే స్పెషల్ రోల్‌లో కనిపించింది. ఈ చిత్రానికి అనిరుథ్ రవిచందర్ సంగీతాన్ని ఇచ్చాడు.


Click it and Unblock the Notifications











