Pushpa Raj is Back: పుష్ప 2 పై ఫస్ట్ అప్డేట్ వచ్చేసింది.. రేపు ఆ కార్యక్రమంతో అసలు వర్క్ స్టార్ట్!
అల్లు అర్జున్ సుకుమార్ కలయికలో వచ్చిన పుష్ప ఫస్ట్ పార్ట్ 1 ది రైజ్ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక రెండో పార్ట్ కోసం కూడా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పుష్ప పార్ట్ 1 హిందీలో కూడా ఊహించని స్థాయిలో సక్సెస్ కావడంతో ఇప్పుడు రెండవ భాగం విషయంలో దర్శకుడు సుకుమార్ ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకోబోతున్నాడు. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అనే విషయంలో మొన్నటి వరకు కొంత కన్ఫ్యూషన్ అయితే నెలకొంది. ఇక మొత్తానికి మైత్రి మూవీ మేకర్స్ ఒక అప్డేట్ అయితే ఇచ్చేసింది. ఈ సినిమాను సోమవారం రోజు పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టబోతున్నారు.
పుష్ప సినిమాను మొదట కేవలం ఒక భాగంగానే తెరపైకి తీసుకురావాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత నిడవే ఎక్కువ కావడంతో సినిమా కంటెంట్ కూడా చాలా బలంగా ఉంది అని దర్శక నిర్మాతలు రెండు భాగాలుగా తెరపైకి తీసుకురావాలని డిసైడ్ అయ్యారు. ఇక ఫస్ట్ పార్ట్ సక్సెస్ ను బట్టి కూడా రెండో భాగం గురించి ఆలోచించాలని అనుకున్నారు. కానీ ఊహలకు తగ్గట్టుగానే పుష్ప పార్ట్ వన్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ ను అంతకుమించి అనేలా తెరపైకి తీసుకురావాలని అనుకుంటున్నారు.

దర్శకుడు సుకుమార్ గత కొన్ని నెలలుగా సెకండ్ పార్ట్ స్క్రిప్ట్ పైన వర్క్ చేయాల్సి వచ్చింది. చాలా వరకు మొదట అనుకున్న దానికంటే రెండో భాగంలో కొన్ని మార్పులు చేయాల్సి వచ్చిందట. కమర్షియల్ అంశాలతో పాటు కంటెంట్ కూడా చాలా బలంగా ఉండాలి అని సుకుమార్ కాస్త ఎక్కువగానే టైం తీసుకున్నాడు. ఇక మొత్తానికి స్క్రిప్టివ్ ఫైనల్ కావడంతో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని డిసైడ్ అయ్యారు. సోమవారం రోజు పూజ కార్యక్రమాలతో కొంత వర్క్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. మరి సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











