Pushpa మూవీకి కోలుకోలేని ఎదురుదెబ్బ: అక్కడ మూతపడిన థియేటర్లు.. అన్ని కోట్ల టార్గెట్ కష్టమే!
తెలుగు సినీ ఇండస్ట్రీలో కొంత కాలంగా భారీ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. తద్వారా మన సినిమా స్టామినాను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయి. అదే సమయంలో టాలీవుడ్ హీరోలు సైతం మార్కెట్‌ను గణనీయంగా పెంచుకుంటున్నారు. ఇలా ఇటీవల వచ్చిన చిత్రమే 'పుష్ప'. ఎన్నో అంచనాలతో గ్రాండ్‌గా విడుదలైన ఈ మూవీకి అన్ని భాషల్లోనూ మంచి ఆదరణ లభించింది. ఫలితంగా కలెక్షన్లను కూడా భారీగా అందుకుని హిట్ దిశగా సాగిపోతోంది. అంతా సాఫీగా వెళుతోంది అనుకుంటోన్న సమయంలో 'పుష్ప'కు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమా ప్రదర్శితం అవుతోన్న థియేటర్లు మూతపడిపోతున్నాయి. అసలేం జరిగింది? ఆ వివరాలు మీకోసం!
Recommended Video

‘పుష్ప’గా వచ్చేసిన ఐకాన్ స్టార్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తీసిన 'పుష్ప'. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. కన్నడ పిల్ల రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటించింది. మలయాళ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేశాడు. దేవీ శ్రీ ప్రసాద్ దీనికి సంగీతం అందించాడు. సునీల్, అనసూయ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ఇది డిసెంబర్ 17న భారీగా విడుదలైంది.

భారీగా బిజినెస్.. గ్రాండ్‌గా రిలీజ్
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'పుష్ప' మొదటి భాగంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే అన్ని ఏరియాల రైట్స్ కలిపి రికార్డు స్థాయిలో రూ. 145 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇక, ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 3000 వేలకు పైగానే థియేటర్లలో విడుదలైంది.

పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది
క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'పుష్ప' మూవీ ఎన్నో అంచనాలతో ఐదు భాషల్లో విడుదలైంది. దాదాపు అన్ని ఏరియాల్లోనూ ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. దీంతో థియేటర్లు మొత్తం హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడిపోయాయి. ఇక, ఈ సినిమా అల్లు అర్జున్ 'వన్ మ్యాన్ షో'గా వచ్చి ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే టాక్‌తో విజయం దిశగా ప్రదర్శితం అయిపోతుంది.

కలెక్షన్ల సునామీ... వంద కోట్లతో
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 'పుష్ప' మూవీకి అన్ని ప్రాంతాల్లోనూ అభిమానులతో పాటు సినీ ప్రియుల నుంచి భారీ రెస్పాన్స్ దక్కింది. దీంతో వీకెండ్ పూర్తయ్యే సరికి రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. కొన్ని ఏరియాల్లో ఆల్‌టైం రికార్డులు కూడా నమోదయ్యాయి. ఇక, ఆరు రోజుల్లోనే ఈ మూవీ వంద కోట్ల రూపాయలకు పైగా షేర్‌ను కూడా అందుకుంది.

పుష్పకు కోలుకోలేని ఎదురుదెబ్బ
'పుష్ప' సినిమాకు ముందు వరకూ ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ల ఇష్యూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కోర్టును ఆశ్రయించడంతో రేట్లు పెంచుకోడానికి పర్మీషన్ ఇచ్చింది. తర్వాత ఏపీ ప్రభుత్వం సింగిల్ బెంచ్ విచారణకు పిటీషన్ వేయగా.. కొన్ని మార్గదర్శకాలు సూచించారు. దీంతో టికెట్ల రేట్ల ఇష్యూ మళ్లీ మొదలైంది. దీంతో పుష్పకు కోలుకోలేని దెబ్బ తగిలింది.

అక్కడ మూతపడిన థియేటర్లు
ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ రేట్ల వివాదం మళ్లీ మొదటికి వచ్చింది. దీంతో అతి తక్కువ ధరలకే టికెట్లు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని చాలా థియేటర్లు నిన్నటి నుంచే మూసేశారు. అదే సమయంలో కొన్నింటిని ఏపీ ప్రభుత్వ అధికారులు సీజ్ చేశారు. ఇలా రాష్ట్రమంతా కొనసాగింది. దీంతో ఇది పుష్ప కలెక్షన్లపై ప్రభావాన్ని చూపించబోతుంది.


Click it and Unblock the Notifications











