twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ : ‘పుష్ప’ వంద శాతం లోకల్ ప్రొడక్ట్.. అదంతా ఇక్కడి వారి కోసమేనంటా

    |

    ఓ సినిమాను తెరకెక్కించాలంటే ఎన్నో వ్యయప్రయాసలకు గురి కావాల్సి వస్తుంది. కథను బట్టి కొన్ని దేశాలు, ఖండాలను దాటాల్సి వస్తుంది. విదేశాల్లో తెరకెక్కించే చిత్రాల్లో ఓ భారీ తనం ఉంటుందని మేకర్స్ భావన. అయితే నేటివిటీకి దగ్గరగా సహజత్వం ఉట్టిపడేలా కథ, కథనం, పాత్రలు పండాలంటే లోకల్‌‌గానే షూటింగ్ చేయాల్సి ఉంటుంది. తాజాగా స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్ర షూటింగ్‌ను ఇండియాలోనే పూర్తి చేయాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. వీటికి సంబంధించిన కొన్ని విషయాలను ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ తెలిపాడు. అవేంటో ఓ సారి చూద్దాం.

    Recommended Video

    Allu Arjun's Pushpa Breaks NTR Record With Most Liked First Look Poster

    <strong>మాతృదినోత్సవం.. ఎమోషనల్‌గా టచ్ చేసిన చిరు.. మహేష్ బాబు, అల్లు అర్జున్ ట్వీట్స్ వైరల్</strong>మాతృదినోత్సవం.. ఎమోషనల్‌గా టచ్ చేసిన చిరు.. మహేష్ బాబు, అల్లు అర్జున్ ట్వీట్స్ వైరల్

    రంగస్థలం తరువాత లాంగ్ గ్యాప్..

    రంగస్థలం తరువాత లాంగ్ గ్యాప్..

    సుకుమార్ రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్ తరువాత.. తెలంగాణ పోరాటం గురించి చదివానని అన్నాడు. దానిపైనే సినిమా చేద్దామని అనుకున్నట్టుగా తాజా ఇంటర్వ్యూలో తెలిపాడు. మొత్తానికి అల్లు అర్జున్‌తో పుష్ప చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్దమయ్యాడు.

    కరోనాతో తారుమారు..

    కరోనాతో తారుమారు..

    పుష్ప చిత్రానికి సంబంధించి ఓ షెడ్యూల్ పూర్తైన సంగతి తెలిసిందే. ఇక రెండో షెడ్యూల్‌లో అల్లు అర్జున్ పాల్గొనాల్సి ఉండగా.. కేరళ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో కేరళ అడువుల్లో చిత్రీకరించాల్సిన ముఖ్యమైన సీన్స్ అన్నీ వాయిదా పడ్డాయి. కరోనా దెబ్బకు అంతా తారుమారైంది.

    ఓ సీన్ కోసమే..

    ఓ సీన్ కోసమే..

    అలాగే పుష్ప సినిమాలోని ఓ ఎపిసోడ్ కోసం భారీగా ఖర్చు చేయనున్నట్టు తెలుస్తున్నది. ఆరు నిమిషాల ఎపిసోడ్ కోసం 6 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ సీన్‌ను కూడా విదేశాల్లో చిత్రీకరించాలని మొదటగా భావించినా.. ప్రస్తుతమున్న నేపథ్యంలో అన్నీ ప్రణాళికలను మార్చేశారట.

    వందశాతం లోకల్ ప్రొడక్ట్..

    వందశాతం లోకల్ ప్రొడక్ట్..

    పుష్ప చిత్రాన్ని వంద శాతం ఇండియన్ ప్రొడక్ట్‌గా మలచబోతోన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేస్తూ.. ‘అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా మలచబోతోన్నారు.. ఓ యాక్షన్ సీన్ కోసం ఆరు కోట్లు ఖర్చు పెట్టబోతోన్నారు. అంతేకాకుండా.. భారత సినీ శ్రామికులకు ఉపాధి కల్పించేందుకు వందశాతం ఇండియాలో షూట్ చేయబోతోన్నార'ని తెలిపాడు.

    English summary
    AlluArjun is going all out to make his next film - #Pushpa - memorable... The actor has plans to spend whopping ₹ 6 cr for a 6-minute action sequence... That's not all, #Pushpa will be 100% 'Made in #India' project, with an effort to provide employment to #Indian film workers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X