Pushpa WW Theatres Count: ఆల్ టైమ్ టాప్ 10లో చేరిన అల్లు అర్జున్.. మెగాస్టార్ కంటే తక్కువే!
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడూ లేని విధంగా పాన్ ఇండియా సినిమాలు రూపొందుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ స్థాయిని మరో లెవెల్ కు తీసుకెళ్లేలా దర్శకులు హీరోలు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకసారి పాన్ ఇండియా సినిమా సెట్స్ పైకి వచ్చింది అంటే చాలు అన్ని వర్గాల ప్రేక్షకులలో కూడా అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. సినిమా విడుదల చేసే సమయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక పుష్ప సినిమా కూడా ఏ స్థాయిలో విడుదల అవుతుంది అనేది కూడా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. అత్యధిక థియేటర్స్ లో విడుదల అవుతున్న సినిమాల లిస్టులో అల్లు అర్జున్ కూడా టాప్ టెన్ చేరినట్లు తెలుస్తోంది.
Recommended Video

సుకుమార్ మాస్ స్టైల్ లో..
సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప సినిమా మొదట కేవలం తెలుగులోనే తెరపైకి తీసుకురావాలని అనుకున్నారు. కానీ ఆ తర్వాత సినిమా తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అని నమ్మకంతో పాన్ ఇండియా ప్రాజెక్టుగా మార్చేశారు. సుకుమార్ ఫుల్ మాస్ కమర్షియల్ సినిమాను తెర పైకి తీసుకు వస్తే ఎలా ఉంటుందో పుష్ప సినిమా అంతకుమించి అనేలా ఉంటుంది అని ఇప్పటికే అల్లు అర్జున్ ఒక క్లారిటీ ఇచ్చేశాడు.

నెంబర్ వన్ లో ప్రభాస్ సినిమా
ఇక సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్స్ లలో విడుదల చేయబోతున్నారు. ఒక విధంగా ఇది అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ అని చెప్పవచ్చు. టాప్ టెన్ లిస్ట్ లోకి వెళితే.. బాహుబలి సినిమాతో రెబల్ స్టార్ ప్రభాస్ మొదటి స్థానంలో ఉన్న విషయం అందరికి తెలిసిందే. బాహుబలి సెకండ్ పార్ట్ దాదాపు తొమ్మిది వేల థియేటర్స్ లో విడుదల అయినట్లు సమాచారం.

సాహో - సైరా..
ఇక రెండవ స్థానంలో సాహో సినిమా 7978 థియేటర్స్ లో విడుదల అయింది. ఓపెనింగ్స్ తో నే సాంగ్ సినిమా నిర్మాతలు సేఫ్ అయ్యారంటే అందుకు కారణం ఆ సినిమాను అత్యధిక థియేటర్స్ లో విడుదల చేయడమే. ఇక మూడవ స్థానంలో మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి నిలిచింది. ఆ సినిమా 4632 థియేటర్లలో విడుదలైంది.

పుష్ప ఎన్ని థియేటర్స్ లో అంటే..
బాహుబలి మొదటి పార్ట్ 4 వేలకు పైగా థియేటర్లలో విడుదల కాగా ఇప్పుడు పుష్ప సినిమా మొదటి భాగం 3 వేలకు పైగా థియేటర్లలో విడుదలవుతోంది. ఒక విధంగా మెగాస్టార్ చిరంజీవి సైరా సినిమా కంటే తక్కువ స్థాయిలో ఈ సినిమా విడుదల అవుతుండటం విశేషం. గడిచిన రెండేళ్లలో పాన్ ఇండియా మార్కెట్ స్థాయి అమాంతంగా పెరిగిపోయింది. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో పుష్ప సినిమా ఐదువేలకు పైగా థియోటర్స్ లో విడుదల అవుతుందని అనుకున్నారు. కానీ నిర్మాతలు మాత్రం ఆ స్థాయిలో విడుదల చేయడం లేదు.

ఆ తరువాత స్థానాల్లో..
ఇక అజ్ఞాతవాసి సినిమా 2800 థియేటర్లలో విడుదల కాగా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా 2600 థియేటర్లలో విడుదలైంది. మహేష్ బాబు స్పైడర్ సినిమా 2400 థియేటర్స్ లో విడుదలవ్వగా భరత్ అనే నేను అదే స్థాయిలో 2400 థియేటర్లలో విడుదలైంది. ఎన్టీఆర్ అరవింద సమేత సినిమా 2300 థియేటర్స్ లలో విడుదలైంది. ఇక పుష్ప సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు.
రిలీజ్ ఈవెంట్ తోనే ఆ విషయం చాలా క్లారిటీ గా అర్థమైంది. లక్షలాదిమంది అభిమానుల మధ్య లో అల్లు అర్జున్ చాలా నమ్మకంతో కనిపించాడు. తప్పకుండా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ కు తగ్గట్టుగా ఉంటుంది అని ధైర్యంగా చెబుతున్నాడు. మరి సినిమా ఆ నమ్మకాన్ని ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











