చిత్రం చూసి నవ్వని వాళ్లకి లక్ష ఇస్తాం

By Srikanya

pusthakamlo konni pageelu missing Challenge
హైదరాబాద్ : ''సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు మా చిత్ర యూనిట్ అంతా నవ్వుతూనే ఉంది. అప్పుడే అనిపించింది సినిమా చూసేవాళ్లూ నవ్వు ఆపుకోలేరని.. ఇప్పుడు ప్రేక్షకులు మా నమ్మకాన్ని నిజం చేశారు. మా సినిమాకొచ్చే ప్రేక్షకులకు కొత్త స్కీం పెడుతున్నాం. మా చిత్రాన్ని చూసి నవ్వని వాళ్లకి రూ. లక్ష ఇస్తాం. దీని వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తాము''అన్నారు శ్రీ. ఆయన హీరోగా తెరకెక్కిన చిత్రం 'పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్‌'. సుప్రజ జంటగా నటించింది. సాజిద్‌ ఖురేషి దర్శకుడు. సోహైల్‌ అన్సారీ నిర్మాత. ఈ సినిమా ఇటీవల విడుదలైంది.

దర్శకుడు మాట్లాడుతూ ''ఈ సినిమాలో నటీనటులు, దర్శకుడు, సాంకేతిక నిపుణులు.. ఇలా అందరూ కొత్తవారే. దీంతో ఫలితంపైన కొంత మేర భయంగా ఉండేది. ఇప్పుడు మా సినిమాకి వస్తోన్న స్పందన చూస్తే చాలా ఆనందంగా ఉంది. ముప్ఫై ఏళ్లుగా పరిశ్రమలో నటులుగా నిలవడానికి పోరాడుతున్న ఇరవై మందికిపైగా కొత్త నటుల్ని సినిమా ద్వారా పరిచయం చేశార. ఈ సినిమా విజయయాత్రను కూడా చేపడుతున్నాము''అన్నారు.

కథలో ....విజయ్‌ కుమార్‌ (శ్రీ), సంధ్య (సుప్రజ) ప్రేమించుకుంటారు. ఇంట్లో వాళ్లని ఒప్పించి పెళ్లికి సిద్ధమవుతారు. ఆ ఆనందంలో పెళ్లికి ముందురోజు శ్రీ తన స్నేహితులు శివ(రాహుల్‌), బాలాజి (సతీష్‌), సలీమ్‌ (మస్త్‌ అలి)తో కలసి క్రికెట్‌ ఆడటానికి వెళ్తాడు. అక్కడ అనుకోకుండా విజయ్‌ గాయపడతాడు. ఈ ప్రమాదం వల్ల విజయ్‌ తన గతంలో సంధ్యని ప్రేమించిన రోజులు, పెళ్లి గురించి మరచిపోతాడు. అప్పుడు విజయ్‌ పెళ్లి చేయడానికి అతని స్నేహితులు ఏం చేశారు.. పెళ్లి జరిగిందా లేదా అనేది ఆసక్తికర అంశం.

శ్రీ మాట్లాడుతూ -''తమిళంలో హిట్టయిన 'నడువుల కొంజెం పక్కత్తినె కానుం' చిత్రం సీడీ ఇచ్చి నన్ను చూడమన్నారు దర్శకుడు ఖురేషి. నాకు తమిళం రాదు. అందుకే నా కుటుంబ సభ్యుల్ని చూడమన్నాను. వారందరీకీ సినిమా బాగా నచ్చేసింది. దాంతో ఈ సినిమాకి ఓకే చెప్పా. ఈ పాత్ర పోషిస్తున్నప్పుడే అందులోంచి బయటకు రావడానికి చాలా సమయం పట్టేది.

ఇందులో నేను మెమరీలాస్ పేషెంట్‌ని. సెలైంట్‌గా ఉంటూ అందర్నీ కడుపుబ్బా నవ్విస్తా. నటునిగా నా సామర్థ్యాన్ని పెంచే పాత్ర ఇది. ఈ తమిళ కథను తెలుగు నేటివిటీకి తగ్గట్టు చక్కగా మార్చారు దర్శకుడు ఖురేషీ. రీమేక్ ఇలాక్కూడా చేయొచ్చా అనిపించేలా ఉంటుందీ సినిమా. తప్పకుండా అందరినీ నచ్చుతుందని నా నమ్మకం'' అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ''గతం మరచిపోయిన ఓ యువకుడి పెళ్లి జరిపేందుకు అతని స్నేహితులు ఏం చేశారు అనేదే చిత్రం. ఈ క్రమంలో వారి మధ్య వచ్చే సన్నివేశాలు అందరినీ అలరిస్తాయి. చాలా మంది జీవితంలో మరచిపోవడం సహజం. కానీ కాబోయే భార్యను మరచిపోతే ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా ఉంటుంది. 45 నిమిషాల పెళ్లి సన్నివేశాలు సినిమాకి ప్రధాన ఆకర్షణ''గా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సుప్రజ, మస్తాన్‌ అలి, సతీష్‌, రాహుల్‌ తదితరులు పాల్గొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X