ప్రియమణి... యమ ముదురు

By Bojja Kumar

ప్రియమణి 'యమ ముదురు'గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పృథ్వీరాజ్ హీరోగా నటించిన 'పుదియముగమ్' చిత్రానికి ఇది తెలుగు అనువాదం. 2009లో ఈ చిత్రం మలయాళంలో విడుదలై ఘన విజయం సాధించింది. ఇందులో మీరానంద్ అనే మరో హీరోయిన్ కూడా నటిస్తోంది. లక్ష్మీవెంకటేశ్వర మూవీస్ పతాకంపై అడ్డాల వెంకట్రావు ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. విథ్యమైన కథాంశంతో పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందింది. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ....పృథ్వీరాజ్, ప్రియమణి అభినయం హైలైట్. ఆ ఇద్దరిపై చిత్రీకరించిన సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి. తెలుగు ప్రేక్షకులకు నచ్చే అన్ని రకాల కమర్షియల్ అంశాలూ ఇందులో ఉన్నాయి. అనువాద పనులన్నీ పూర్తయిన ఈ సినిమాని జనవరి తొలివారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

బాల, సాయికుమార్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, పాటలు: చంద్రబోస్, వెన్నెలకంటి, భాగ్యశ్రీ, సంగీతం: దీపక్‌దేవ్, ఛాయాగ్రహణం: భరణి కె. ధరన్, ఫైట్స్: అణల్ అరసు, నిర్వహణ: పి.వి. రమణ, సమర్పణ: ఎ.ఎం. రవితేజ్, దర్శకత్వం: దీపన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X