ఆగస్టు 13న ‘పుత్రుడు’ ఆడియో
'ఫ్రెడ్స ఫిల్మ్ అకాడమి" బ్యానర్ పై శ్రావణ్ కుమార్ భాపట్ల దర్శకత్వంలో రూపొందుతున్న 'పుత్రుడు" సినిమా ఆగష్టు 13 ఆడియో విడుదలకు సిద్దమౌతున్నది. నిర్మాత, సినిమా హీరో ఇంద్రసేన - రెండు రోజుల్లో ప్యాచ్ వర్క్ ముగించుకొని మన ముందుకు వస్తుందని తెలిపారు. ఇందులో తనీష హీరోయిన్ గా నటించనున్నారు. తాను మార్షల్ అర్ట్స్ లో శిక్షణ పొందానని, బాడీ ల్యాంగ్వేజికి తగ్గట్టు మంచి కథ వచ్చిందని, ఈ అవకాశం ఒక చాలెంజ్ గా భావిస్తున్నాని, ఇందులో ద్విపాత్రబినయం చేయవలసి ఉందన్నారు. విద్య డ్యాన్స్ డైరెక్షన్ లో ఇటీవల రెండు పాటలను ఊటిలో చేశామని తెలిపారు.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ నడుస్తుందని, కథాపరంగా ఇనుము బంగారంగా ఎలా మార్పు చెందుతుందనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తీస్తున్నట్లు తెలిపారు. సస్పెన్స్, కామెడీలతో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీస్తున్నట్లు చెప్పారు. సెప్టెంబరులో సినిమా విడుదలైయ్యే విధంగా ష్యూటింగ్ పూర్తి చేన్తున్నామన్నారు.
'బిందు" మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. యం.ఎస్ నారాయణ, సూర్య, కొండవలస లక్ష్మన రావు, దువ్వాసి మోహన్, రాజేంద్ర, ఉత్తేజ్, నల్ల వేణు, పృత్విరాజ్, జీవ, జయవాణి, కవిత తదితరులు ఇందులో నటిస్తున్నారు ఈ సినిమాకు సత్య. వై సంగీతాన్ని అందిస్తున్నారు. కథ, స్ర్కీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం శ్రావణ బాపట్ల.


Click it and Unblock the Notifications











