'పుత్రుడు' ఆడియో ఆవిష్కరణ
"ఇంద్రసేన" హీరోగా ఫ్రెండ్‌షిప్ అకాడమీ పతాకంపై శ్రావణ్ బాపట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న "పుత్రుడు" ఆడియో విడుదల కార్యక్రమం ప్రసాద్ ల్యాబ్స్ లో వైభవంగా జరిగింది. కె.ఎస్.రామారావు ఆడియో సీడీని విడుదల చేయగా, ఆడియో కేసెట్‌ను నటుడు చిన్నా విడుదల చేశారు. ఆడియో విడుదల సందర్భంగా దర్శకుడు శ్రవణ్ భాపట్ల మాట్లాడుతూ..కథ రీత్యా ఇంద్ర భిన్నపాత్రను పోషించాడని తెలిపారు. బంగారాన్ని తయారుచేసే పరుసవేది నేపథ్యంలో కథ సాగుతుందని, మెడికోగా, అఘోరాగా ఇంద్ర నటించాడని చెప్పారు. అంతేగాకుండా మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యంగల ఇంద్ర ఫైట్స్‌ను బాగా చేశాడని దర్శకుడు అన్నారు.
ఇంకా గ్రాఫిక్స్, ఆప్టికల్ వర్క్‌కు సంబంధించిన కార్యక్రమాలు పూర్తికావాల్సి ఉందని, త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని బాపట్ల వెల్లడించారు.ఈ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించానని, గెస్ట్ రోల్ లో చాలా అద్బుతంగా నటించానని నటి కవిత చెప్పింది. ఈ సినిమా యూనిట్ అందరికీ విజయాన్ని చేకూర్చాలని కోరుకుంటున్నానని ఆమె తెలిపింది.
సంగీత దర్శకుడు సత్య మాట్లాడుతూ..కష్టపడి పనిచేశామని, ఫలితాన్ని ప్రేక్షకులు నిర్ణయిస్తారని అన్నారు. చిన్న సినిమా తీస్తే కష్టపడాలి. బాగుంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. దర్శక, నిర్మాతలు ఈ చిత్రాన్ని పట్టుదలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారని కె.ఎస్.రామారావు చెప్పారు. వారి ఫలితం సఫలం కావాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. హీరో ఇంద్రసేన మాట్లాడుతూ.. తాను కథానాయకుడిగా నటించడం, తనకు ఇష్టమైన గాయకుడు బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలో యాక్ట్ చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.


Click it and Unblock the Notifications











