తెలంగాణ మంత్రితో తారక్ భేటి.. సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు గర్వపడేలా స్పెషల్ ఈవెంట్!
తెలుగు ప్రజలంతా ముద్దుగా అన్నా అని పిలుచుకునే అలనాటి స్టార్ హీరో, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గురించి అందరికీ తెలిసిందే. అయితే మే 28వ తేదీన ఆయన శత జయంతి ఉత్సవాలు జరగబోతున్నాయి. 1923 మే 28వ తేదీన జన్మించిన ఎన్టీఆర్ కు ఇప్పుడు రాబోయేది వందో పుట్టిన రోజు. ఈ క్రమంలోనే ఈ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారు.
ఈ క్రమంలోనే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కలిశారు. తెలుగు వెలుగు, సినీ వీక్షకుల ఆరాధ్య దైవం, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎన్టీఆర్ నిలువెత్తు రూపాన్ని తయారు చేయించి ఖమ్మంలో ప్రతిష్టించబోతున్నట్లు తారక్ కు చెప్పారు. ఈ విగ్రహావిష్కరణ మీ చేతుల మీదుగా జరిగితే బాగుంటుందని మంత్రి పువ్వాడ వివరించారట.

ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల రోజున అంటే ఈనెల 28వ తేదీన ఖమ్మంలోని లకారం ట్యాంక్ బండ్ మధ్యలో ప్రతిష్టించనున్నారు. అయితే సీనియర్ ఎన్టీఆర్ మనవడు అయిన జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించ బోతున్నారట. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు రావాలని కోరుతూ.. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తారక్ ను కలిశారు. విగ్రహ ఏర్పాటు పనులు, శత జయంతి ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్ల గురించి వీరిద్దరూ చర్చించారు.
జూనియర్ ఎన్టీఆర్ తో పాటు సుప్రీం కోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రణ్, రవాణా శఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ తో పాటు పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు హాజరు కానున్నారు. ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గతేడాది శతజయంతి ఉత్సవాల ప్రారంభ సమయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పలువురు ఎన్ఆర్ఐలు నిర్ణయించారు.

ఈ క్రమంలోనే మంత్రి సహా పలువురు ఎన్ఆర్ఐలు, తానా సభ్యులు, పారిశ్రామిక వేత్తలు ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. సుమారు 4 కోట్ల రూపాయల వ్యయంతో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుతో ఖమ్మం మరింత వెలుగొందుతుందని ఆయన అభిమానులు అంటురున్నారు.


Click it and Unblock the Notifications











