PV Sindhu: చిరంజీవి పాటకు పీవీ సింధు స్టెప్పులు.. క్యాస్ట్ గురించి వెతికినోళ్ల పరిస్థితి ఏంటని ట్రోలింగ్!
హైదరాబాద్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పుల్లెల గోపిచంద్ స్ఫూర్తితో బ్యాడ్మింటన్ ఎంచుకుంది. చిన్నప్పటి నుంచి బ్యాండ్మింటన్ లో సత్తా చాటుతూ అనేక పథకాలను సాధించింది. దీంతో దేశం గర్వించే క్రీడకారిణిల్లో ఒకరిగా నిలిచింది. 2016లో జరిగిన రియో ఒలింపిక్స్ క్రీడల్లో రజత పతకం సాధించి వాటిలో బ్రాంజ్ మెడల్ గెలుపొందిన తొలి బారతీయ మహిళగా రికార్డ్ సృష్టించింది.
ఇలా తన ఖాతాలో ఎన్నో అవార్డులు, రికార్డులు వేసుకున్న పీవీ సింధును భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. అయితే పీవీ సింధు ఆటల్లోనే కాకుండా డ్యాన్స్ లోనూ అదరగొడుతోంది. అది కూడా మెగాస్టార్ పాటకు స్టెప్పులేసి ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.

స్టార్ హీరోలు కలిసి..
2023 కొత్త సంవత్సరం ఆరంభంలోనే వాల్తేరు వీరయ్యగా సూపర్ హిట్ కొట్టారు మెగాస్టార్ చిరంజీవి. బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి తొలిసారిగా నటించిన ఈ చిత్రంలో వాల్తేరు వీరయ్యగా మాస్ అవతారంతో చిరంజీవి కనిపించగా పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా మాస్ మహారాజా రవితేజ కనిపించాడు. సుమారు 22 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

నాకు తొందర ఎక్కువ..
టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో రూపొందిన వాల్తేరు వీరయ్య సినమాపై మొదటి నుంచి విపరీతమైన క్రేజ్ క్రియేట్ చేసిందన్న విషయం తెలిసిందే. అందుకు తగినట్లుగానే వాల్తేరు వీరయ్య మూవీ అప్డేట్స్ ఉన్నాయి. అందులో మొదటగా విడుదలైన బాస్ పార్టీ పాటతోపాటు నువ్వు శ్రీదేవి, వీరయ్య, పూనకాలు లోడింగ్, నీకు అందమెక్కువ.. నాకు తొందరెక్కువ సాంగ్స్ కి విపరీతమైన స్పందన వచ్చింది.

దేశం గర్వించదగ్గవారిలో..
ఇక బాసు పార్టీ అనే పాటకు ఎంతో మంది సోషల్ మీడియాలో స్టెప్పులేశారు. తమదైన శైలీలో డ్యాన్స్ చేస్తూ రీల్స్ తో ఎంటర్టైన్ చేశారు. ఇక ఇటీవలే ఈ పాట పూర్తి వీడియో విడుదలైంది. అయితే ఈ పాటపై నెటిజన్లు, అభిమానులు స్టెప్పులు వేయడం ఒక ఎత్తు అయితే.. స్టార్ బ్యాండ్మింటన్ పీవీ సింధు తన డ్యాన్స్ తో అదరగొట్టడం మరొక ఎత్తు. దేశం గర్వించదగ్గ క్రీడాకారుల్లో పూసర్ల వెంకట సింధు ఒకరు. ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
కచ్చా బాదామ్ వంటి పాటలకు..
గ్రౌండ్ లో బ్యాడ్మింటన్ తో షాట్స్ కొడుతూ ఇండియాకు అనేక పథకాలు తీసుకొచ్చింది పీవీ సింధు. అయితే పీవీ సింధు ఆటలే కాకుండా అప్పుడప్పుడు డ్యాన్స్ తో కూడా అలరిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే పీవీ సింధు అప్పుడప్పుడు రీల్స్ షేర్ చేస్తుంటుంది. ఇదివరకు కచ్చా బాదామ్, అరబిక్ కుతూ వంటి పాటలకు నర్తించిన పీవీ సింధు తాజాగా మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యలోని బాస్ పార్టీ పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది.
క్యాస్ట్ గురించి సెర్చ్ చేసినవాళ్లు..
బ్లూ కలర్ లెహంగాలో ఎంతో స్టైలిష్ గా కనిపించిన పీవీ సింధు బాసు.. వేర్ ఈజ్ ద పార్టీ అంటూ ఆకట్టుకుంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. కొన్ని గంటల్లోనే 2.5 లక్షలకు పైగా వ్యూస్ రాగా వేలకొద్ది కామెంట్స్ వచ్చాయి. "సింధూ జీ మీ డ్యాన్స్ సూపర్ త్వరలో ఇండస్ట్రీలో చూడాలనుకుంటున్నాం" అంటూ కొందరు కామెంట్స్ చేస్తే.. మరికొందరు "గూగుల్ సెర్చ్ లో పీవీ సింధు క్యాస్ట్ గురించి సెర్చ్ చేసినవాళ్ల పరిస్థితి ఏంటో.. ఒక బ్యాచ్ హ్యాపీ.. మరొక బ్యాచ్ ఏడుపు" అంటూ ట్వీట్ చేశారు. ఇలా పీవీ సింధు డ్యాన్స్ వీడియో తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











