twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనా కేవలం ఆరంభమే.. ఆకట్టుకుంటోన్న మోషన్ పోస్టర్.. కొత్త జానర్‌లో ప్రశాంత్ వర్మ

    |

    విభిన్న చిత్రాలను తెరకెక్కిస్తాడన్న పేరున్న ప్రశాంత్ వర్మ.. ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. అ!, కల్కి చిత్రాలతో ప్రశాంత్ వర్మ తన సత్తా చాటుకున్నాడు. కమర్షియల్‌గా అంత వర్కౌట్ కాకపోయినా.. ఇండస్ట్రీ మొత్తాన్ని ఆకర్షించాయి. అ! సినిమాకు అయితే జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ప్రశాంత్ వర్మ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాన్ని మూటగట్టుకుంటున్నా తన శైలిని మాత్రం వీడటం లేదు. ఈ క్రమంలోనే తన మూడో ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను ఇచ్చేశాడు.

    విభిన్న చిత్రాలను తెరకెక్కిస్తాడన్న పేరున్న ప్రశాంత్ వర్మ..

    విభిన్న చిత్రాలను తెరకెక్కిస్తాడన్న పేరున్న ప్రశాంత్ వర్మ..

    ఇప్పటికే తానేంటో నిరూపించుకున్నాడు. అ!, కల్కి చిత్రాలతో ప్రశాంత్ వర్మ తన సత్తా చాటుకున్నాడు. కమర్షియల్‌గా అంత వర్కౌట్ కాకపోయినా.. ఇండస్ట్రీ మొత్తాన్ని ఆకర్షించాయి. అ! సినిమాకు అయితే జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ప్రశాంత్ వర్మ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాన్ని మూటగట్టుకుంటున్నా తన శైలిని మాత్రం వీడటం లేదు. ఈ క్రమంలోనే తన మూడో ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్‌డేట్‌ను ఇచ్చేశాడు.

    నానా ప్రయత్నాలు..

    నానా ప్రయత్నాలు..

    అ!, కల్కి సినిమాలు బాగానే ఉన్నా కలెక్షన్ల వర్షం కురిపించలేకపోయాయి. దీంతో మూడో సినిమా కోసం నిర్మాతను దొరకబట్టడంలో ప్రశాంత్ వర్మకు చాలా సమయం పట్టింది. మూడో ప్రాజెక్ట్‌ను సెట్ చేసుకునేందుకు ప్రశాంత్.. నానా ప్రయత్నాలు చేసినట్టు కనిపిస్తోంది.

    నెటిజన్లకు సమాధానంగా..

    నెటిజన్లకు సమాధానంగా..

    అయితే ప్రశాంత్ వర్మ మూడో ప్రాజెక్ట్‌పై ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్నాడు. మూడో సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా పూర్తయిందని ఓ పెద్ద పుస్తకాల కట్టను చూపెట్టాడు. అయితే నిర్మాతలు దొరకడం లేదని అప్పట్లో ఆయన కామెంట్ చేశాడు.

    అ! సీక్వెల్ కాదు..

    అ! సీక్వెల్ కాదు..

    మూడో ప్రాజెక్ట్ రాబోతోందని ప్రశాంత్ వర్మ ప్రకటించిన వెంటనే.. అందరూ ఆసక్తిగా ఎదరుచూడటం ప్రారంభించారు. అది కచ్చితంగా అ! సీక్వెల్ అయి ఉంటుందని అంతా భావించారు. ఈ మేరకు ప్రశాంత్ వర్మకు నెటిజన్ల ప్రశ్నలు ఎక్కువ అవడంతో.. తన మూడో ప్రాజెక్ట్ అ! సీక్వెల్ కాదని క్లారిటీగా చెప్పాడు.

    కరోనా నేపథ్యంలో..

    కరోనా నేపథ్యంలో..

    ప్రస్తుత పరిస్థితులను ఆధారంగా చేసుకుని తన మూడో ప్రాజెక్ట్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రీ లుక్ అందర్నీ ఆకట్టుకుంది. కరోనా వ్యాక్సిన్ లోడింగ్ 10 శాతం. అని ఫస్ట్ లుక్ త్వరలోనే రిలీజ్ చేస్తానని ప్రకటించడంతో అంచనాలు పెరిగాయి.

    Recommended Video

    Why Upcoming Directors Should've To Rake RGV As Inspiration ? || Filmibeat Telugu
     ఆకట్టుకుంటోన్న మోషన్ మోస్టర్...

    ఆకట్టుకుంటోన్న మోషన్ మోస్టర్...

    నేడు ప్రశాంత్ వర్మ బర్త్ డే (మే 29). ఈ సందర్భంగా మూడో ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చాడు. ఈ మేరకు రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ వైరల్ అవుతోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోందని.. స్టే హోమ్ స్టే సేఫ్ అంటూ కర్నూలు కొండారెడ్డి బుర్జును చూపడం, కరోనా కేవలం ఆరంభం మాత్రమేనని పోస్టర్‌పైన చెప్పడం చివర్లో డైనోసర్ నోటిని చూపెట్టడం చూస్తుంటే మరోసారి ప్రశాంత్ వర్మ ఏదో మ్యాజిక్ చేసేందుకు రెడీ అయ్యాడనే అర్థమవుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మిగతా వివరాలు మాత్రం వెల్లడించలేదు.

    English summary
    Prasanth Varma Third Project Update. He says that Hinting the climax twist in the first looks.. Cant wait to show you the first look of my next.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X