మజోజ్ సినిమాకు పి.వాసు దర్శకత్వం
ఇటీవల చంద్రముఖి వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని అందించిన పి వాసు మనోజ్‌కుమార్ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. మనోజ్ తొలి సినిమా దొంగ దొంగది మంచి కలెక్షన్లు రాబట్టినా ఇటీవల విడుదలైన శ్రీ చిత్రం ఫ్లాప్ అయింది. దీనితో మోహన్‌బాబు తన కెరీర్‌తో పాటు ఇద్దరు కొడుకుల కెరీర్‌లను రక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. కాగా మోహన్‌బాబు తాజా చిత్రానికి ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించనున్నారు. గతంలో మోహన్‌బాబు, ముత్యాల సుబ్బయ్య కాంబినేషన్‌లో వచ్చిన మా ఇంటికథ, సోగ్గాడి కాపురం సినిమాలు హిట్ అయ్యాయి.


Click it and Unblock the Notifications