గోల్డెన్ ఛాన్స్ : మహేష్ బాబు సినిమాలో నటించాలని ఉందా?

By Srikanya

హైదరాబాద్ :మహేష్‌బాబు ప్రస్తుతం శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం' సినిమాలో నటిస్తున్నారు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' చిత్రం తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్‌లో ‘బ్రహ్మోత్సవం' రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి.సినిమాస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అయితే పి.వి.పి సంస్థ ఈ సినిమా కోసం కాస్టింగ్‌ కాల్‌ ఇచ్చింది. ఈ చిత్రంలో నటించడానికి 15 నుంచి 50 సంవత్సరాల వయస్సులోపు మేల్‌, ఫీమేల్‌ ఆర్టిస్టులు కావాలని ప్రకటించారు. ఆసక్తి కలవారు ఫుల్ సైజ్, క్లోజప్ ఫోటోతో కాంటాక్ట్ చేయాల్సిందిగా ప్రకటించారు. పైన ఫొటోలో ఉన్న మెయిల్ ఐ.డికి ఫోటోలు పంపించవచ్చు. ఈ సినిమా మహేష్ బాబుతోనే అయితే... తనతో తెరపంచుకునే అవకాశం కొత్త వారికి కలుగుతుంది.

PVP Cinema Casting Call- Brahmostavam

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తర్వాత మరోసారి సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘బ్రహ్మోత్సవం'. పివిపి సినిమాస్ పతాకంపై ప్రముఖ నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

‘బ్రహ్మోత్సవం'లో మహేష్ సరసన హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ఎంపికైనట్టు వార్తలు వచ్చాయి. వాటిని చిత్ర బృందం ఇంకా ఖరారు చేయలేదు. ఈ సినిమాలో రావు రమేష్ కీలక పాత్రలో నటించనున్నారు. మిగతా వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X