ఎన్టీఆర్ ఔట్: నాగ్-కార్తి మల్టీస్టారర్ ఖరారు (అపీషియల్)
హైదరాబాద్: దక్షిణ భారత దేశంలో అత్యుత్తమ నిర్మాణ సంస్థగా పేరొందిన ‘పివిపి సినిమా' ఎప్పుడూ తెలుగు సినిమా ప్రేక్షకులకు కొత్తదనాన్ని పంచుతూనే ఉంది. తాజాగా ఈ సంస్థ ఓ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని రూపొందించనుంది. తెలుగు మరియు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు స్టార్ హీరోల కలయికలో ఓ చిత్రాన్ని నిర్మించనుంది.
తెలుగు స్టార్ అక్కినేని నాగార్జున మరియు తమిళ స్టార్ కార్తీల కాంబినేషన్లో టాలెంటెడ్ డైరెక్టర్ వంశీ పైడిల్లి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. పి.వి.పి సినిమా తమ అత్యుత్తమ నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించనుంది. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

అక్కినేని నాగార్జునకు తెలుగుతో పాటు తమిళ చిత్ర సీమలో కూడా మంచి ఇమేజ్ ఉంది. అలాగే కార్తీ ఇటీవలే ‘మద్రాస్' చిత్రంతో తమిళంలో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కార్తికి తెలుగులోనూ మంచి ఆదరణ లభిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం ద్వారా తెలుగు-తమిళ ఇండస్ట్రీలను ఏకం చేసే అద్భుత అవకాశాన్ని పి.వి.పి సొంతం చేసుకోవడం విశేషం. ఈచిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని పివిపి సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.
తప్పుకున్న ఎన్టీఆర్...
వాస్తవానికి ఈ ప్రాజెక్టు తొలుత జూ ఎన్టీఆర్-నాగార్జున కాంబినేషన్లో అనుకున్నారు. అయితే కథ, స్క్రిప్టు పరమైన అంశాలతో విబేధించిన జూ ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకున్నారు. దీంతో ఎన్టీఆర్ స్థానంలో కార్తిని తీసుకున్నారు. స


Click it and Unblock the Notifications











