జూ ఎన్టీఆర్‌కు ‘టాప్’ లేపే ఆఫర్...కానీ ఒక్క షరతు?
అయితే షరతులతో కూడిన తమ అగ్రిమెంటుకు సైన్ చేస్తేనే ఈ ఆఫర్ వర్తిస్తుందని షరతు పెట్టినట్లు తెలుస్తోంది. తమ బేనర్లో వరుసగా మూడు సినిమాలు చేస్తే ఎన్టీఆర్‌ను రెమ్యూనరేషన్లో టాప్ రేంజికి తీసుకెళతామని ఆ సంస్థ తమ అగ్రిమెంటులో ప్రేర్కొన్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై జూనియర్ ఎన్టీఆర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. త్వరలో దీనిపై ఓ క్లారిటీ రానుంది.
పివిపి సంస్థ ప్రస్తుతం రవితేజ హీరోగా 'బలుపు' అనే చిత్రాన్ని రూపొందిస్తోంది. దీంతో పాటు అనుష్క ప్రధాన పాత్రలో ఆర్య హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ 'వర్ణ' చిత్రం కూడా ఈ సంస్థనే తెరకెక్కిస్తోంది. ప్రస్తుతం పివిపి సంస్థ సౌత్ ఇండియాలో భారీ సినీ నిర్మాణ సంస్థల్లో ఒకటిగా ఉంది.
ఇక జూ ఎన్టీఆర్ ఇప్పుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత. ఈ చిత్రం తర్వాత బెల్లంకొండ నిర్మాతగా సంతోష్ శ్రీనివాస్ రూపొందించబోయే 'రభస' చిత్రంలో నటించబోతున్నాడు జూనియర్.


Click it and Unblock the Notifications












