మహేష్ బాబు బ్రహ్మోత్సవానికి నిర్మాత అతనే!
హైదరాబాద్: ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా(శ్రీమంతుడు) చేస్తున్న మహేష్ బాబు త్వరలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మర సినిమా చేయడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. గతంలో మహేష్ బాబుకు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' లాంటి భారీ విజయం అందించిన శ్రీకాంత్ అడ్డాలపై మహేష్ బాబు మంచి నమ్మకం పెట్టుకున్నాడు.
త్వరలో ఈ చిత్రం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు కాలేదు కానీ...ప్రస్తుతానికి ‘బ్రహ్మోత్సవం' అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. ఈచిత్రాన్ని పివిపి సినిమా అధినేత ప్రసాద్ వి పొట్లూరి నిర్మించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఏ విషయం అనేది తేలనుంది. మే నెలలో సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతం కొరటాల శివ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఇప్పటి వరకు టైటిల్ అయితే ఖరారు కాలేదు. ఆ మధ్య పలు టైటిల్స్ వినిపించినా...అవేవీ కాదని కొట్టిపారేసారు దర్శకుడు శివ.
కథపై పూర్తి కసరత్తు చేసి మరీ కొరటాల శివ కసిగా రంగంలోకి దిగాడంటున్నారు. హిట్ ఖాయం అనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ''భారీ హంగులతో తెరకెక్కుతున్న చిత్రమిది. మహేష్ శైలికి తగ్గట్టుగా ఫ్యామిలీ అండ్ మాస్ అంశాల్ని మేళవించి కథను సిద్ధం చేశారు దర్శకుడు. అందరికీ నచ్చే ఓ మంచి సినిమా అవుతుంది''అని చెబుతున్నారు నిర్మాతలు.
ఓవర్సీస్ లో అత్తారింటికి దారేది వంటి భారీ సినిమాలు పంపిణీ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంగీతం:దేవిశ్రీప్రసాద్,ఫోటోగ్రఫిః మది, ఫైట్స్: అరసు, ఎగ్జిక్యూటివ్ ప్రసాద్:అశోక్, నిర్మాతలుః ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సివియమ్. ఛాయాగ్రహణం: ఆర్.మది, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.


Click it and Unblock the Notifications











